Beauty Tips

Hair FAll Tips:జుట్టు రాలడం ఆగి.. 5 రోజుల్లో ఒత్తుగా పెరగాలా? ఇంట్లోనే ఈ ‘మ్యాజిక్ ఆయిల్’ తయారు చేసుకోండి!

Hair FAll Tips:జుట్టు రాలడం ఆగి.. 5 రోజుల్లో ఒత్తుగా పెరగాలా? ఇంట్లోనే ఈ ‘మ్యాజిక్ ఆయిల్’ తయారు చేసుకోండి..నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం (Hair Fall). కాలుష్యం, పోషకాహార లోపం వల్ల జుట్టు పల్చబడిపోతుంటుంది. అయితే, దీని కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో ఉండే పదార్థాలతోనే కేవలం 5 రోజుల్లో అద్భుతమైన మార్పును చూడవచ్చు.

కావలసిన పదార్థాలు:
తమలపాకులు: 2 (చిన్న ముక్కలుగా చేసినవి)
కలోంజి గింజలు (నల్ల జీలకర్ర): 1 స్పూన్
మెంతులు: 1 స్పూన్
ఆవనూనె: 100 ml

తయారీ విధానం:
ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో 100 ml ఆవనూనె పోయండి.అందులో కట్ చేసి పెట్టుకున్న తమలపాకులు, ఒక స్పూన్ కలోంజి గింజలు, ఒక స్పూన్ మెంతులు వేయండి.ఈ మిశ్రమాన్ని మంట తగ్గించి 5 నుండి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి.

నూనె రంగు మారాక స్టవ్ ఆపి, చల్లారనివ్వాలి.పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి వడకట్టుకోవాలి. ఈ నూనె 15 నుండి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది.

ఎలా ఉపయోగించాలి?
ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి.కనీసం 5 నిమిషాల పాటు తలని సున్నితంగా మసాజ్ చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ పెరిగి జుట్టు మూలాలు బలోపేతం అవుతాయి.అరగంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయడం ఉత్తమం.వారానికి రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరగడం మీరే గమనిస్తారు.

ఈ పదార్థాల వల్ల కలిగే ఉపయోగాలు:
మెంతులు: ఇందులో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టు రాలడాన్ని అరికట్టి, కుదుళ్లకు బలాన్నిస్తుంది.
కలోంజి గింజలు: జుట్టు మృదువుగా, కాంతివంతంగా మెరిసేలా చేయడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
తమలపాకులు: జుట్టు ఒత్తుగా పెరగడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
ఆవనూనె: ఇది నేచురల్ కండిషనర్‌గా పనిచేస్తుంది. చుండ్రును తగ్గించి, పొడి జుట్టు (Dry Hair) సమస్యను దూరం చేస్తుంది.

గమనిక: జుట్టు సమస్యలు మరీ ఎక్కువగా ఉంటే నిపుణులను సంప్రదించడం మేలు. ఈ చిట్కా సాధారణ జుట్టు సమస్యలకు చక్కగా పనిచేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."