Movies

అక్కినేని కోడలు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

చెన్నైలో పుట్టి పెరిగిన సమంత ‘ఏ మాయి చేసావే’ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. సమంత మొదట తన కెరీర్ ని మోడలింగ్ తో ప్రారంభించింది. చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీ నుండి డిగ్రీ పట్టా అందుకుంది. ఆమె కెరీర్ నుంచి అక్కినేని కోడలి వరకు ఆమె ప్రస్థానం గురించి తెలుసుకుందాం. సమంత చిన్నతనంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటంతో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మొదట మోడలింగ్ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 1.”ప్రత్యూష ఫౌండేషన్” స్థాపించి పేద పిల్లలకు,అనారోగ్యంతో ఉన్న మహిళలకు ఆరోగ్య సేవలు అందిస్తుంది. 

2.సమంతా తండ్రి తెలుగు…. తల్లి మలయాళీ అయినా సమంతా చెన్నైలో పుట్టి పెరిగినందు వల్ల తమిళియన్ అని చెప్పుకుంటుంది. మొదట్లో తెలుగు కష్టంగా ఉన్నా ఇప్పుడు గలగలా మాట్లేస్తుంది. 

3. మనందరికీ ఈమె సమంతగా తెలుసు. ఫ్రెండ్స్ సాం అని పిలుస్తారు. అలాగే సమంతాకి “యశోద” అనే ఇంకొక పేరు కూడా ఉంది.4.ఆమె మొదట రవి వర్మన్ దర్సకత్వంలో “మాస్కో ఇన్ కావేరి” అనే సినిమాలో నటించింది. కానీ మొదట “విన్నత్తాండి వరువాయ” విడుదల అయింది. 

5.సమంతా కి హాలీవుడ్ హీరో ఆడ్రీ హెప్బర్న్ ప్రేరణ అని చెప్పుతుంది. సినిమా మరియు వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపాడని చెప్పుతూ ఉంటుంది. 

6.ఆమె చదువుకొనే రోజుల్లో కాలేజ్ టాపర్ గా ఉండేది. దాని కోసం చాలా కష్టపడేది. అలాగే సినిమాల్లో కూడా బాగా కస్టపడి ఉన్నత స్థానానికి ఎదిగింది. 
7.ఆమెకు పచ్చి మాంసం, కూరగాయలూ కలిపి ఉడికించి చేసే జపనీస్ వంటకం సూషీ ,డెయిరీ మిల్క్ చాక్లెట్ చాలా ఇష్టం. పాలకోవా ఆమెకి ఇష్టమైన స్వీట్.

8.రోడా బ్రైన్ రచించిన “ద సీక్రెట్” అనే పుస్తకం చాలా ఇష్టమైన పుస్తకం. ఈ పుస్తకాన్ని లా ఆఫ్ ఫాసినేషన్ మీద రాసారు. 

9.సమంత 2013 లో మధుమేహం బారిన పడింది. అయితే ఈ సమస్య నుండి కొన్ని నెలల్లోనే బయట పడింది. 
10.సమంత,నాగ చైతన్య ‘ఏ మాయ చేసావే’ సినిమా టైంలో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి 2017 సంవత్సరం అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నారు.