Devotional

జయేంద్ర సరస్వతి ఆస్తి ఎవరికి చెందుతుంది… ఎంత ఆస్థి ఉందో తెలుసా?

అభినవ శంకరులుగా పేరు గాంచిన తమిళనాడు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి ఫిబ్రవరి 28 వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాసను విడిచి పరమేశ్వరునిలో ఐక్యం అయ్యారు. చాలా రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతికి గుండెపోటు రావటంతో శంకర మఠం సమీపంలోని శంకర్ మల్టీ స్పెషల్ ప్రయివేట్ హాస్పిటల్ లో చేర్పించి మెరుగైన చికిత్స అందించిన పరిస్థితి చేయి దాటటంతో జయేంద్రుల వారు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాసను విడిచారు.

ఇదివరకు రెండు నెలల క్రితం కూడా ఆయనకు స్ట్రోక్ రావటంతో చికిత్సను అందించారు. శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి తర్వాత కంచి కామకోటి 69 వ కంచి కామకోటి పీఠాధిపతిగా 1954 మార్చి 24 వ తేదీన శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి భాద్యతలు స్వీకరించారు.

అయన 1954 నుంచి కంచి కామకోటి పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. అయన 1939 జులై 18వ తేదీన తంజావూరు జిల్లాలోని ఇరుల్ నీకి లో జన్మించారు. ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య మహదేవ.

పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించాక పేరును జయేంద్ర సరస్వతిగా మార్చుకున్నారు. జగద్గురు అది శంకరాచార్య స్థాపించి స్వయంగా నిర్వహణ భాద్యతలు చేపట్టిన కంచి పీఠానికి ఎంతో విశిష్టత ఉంది. ఆ పరంపరలో మన అందరిని తరింపచేసిన పరమ ఆచార్య చంద్రశేఖర సరస్వతిని భూమి పైకి దిగి వచ్చిన అది గురువుగా పూజిస్తారు.

అలాంటి మహనీయుడిచే సంకల్పించబడి వారసులుగా కంచి పీఠాధిపత్యాన్ని స్వీకరించిన జయేంద్ర సరస్వతి కంచి పీఠం యొక్క ప్రాధాన్యతను నిలబెడుతూ అందరికి మార్గదర్శకులు అయ్యారు.

అయితే శివైక్యం చెందిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి హయాంలో కంచి పీఠం ఆస్తులు గణనీయంగా వృద్ధి చెందాయి. వేల కోట్ల ఆస్తులు పెరిగి మఠం పేరు ప్రతిష్టలు దేశ విదేశాలకు వ్యాప్తి చెందాయి.

ప్రస్తుతం ఉన్న శిష్యగణంలో 40 శాతం అదనంగా భక్తులు పెరిగిపోయారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ స్థిర,చర ఆస్తులు పెరిగిపోయాయి. అమెరికా,ఇంగ్లాండ్ తదితర దేశాల్లో స్వామిజి భక్తులు పెరిగిపోయారు.

జయేంద్ర సరస్వతి కంచి కామకోటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మత ప్రచారంతో పాటుగా స్కూల్స్,హాస్పిటల్స్ నిర్మించారు. పారిశ్రామికవేత్తలను శిష్యులుగా చేసుకొని సామజిక కార్యక్రమాలను చేపట్టి అధిక మొత్తంలో విరాళాలను సేకరించారు.

దేశ వ్యాప్తంగా 38 శాఖలను ప్రారంభించి భక్తుల నుంచి వేల కోట్ల విరాళాలను సేకరించి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. దీనితో ప్రముఖుల దృష్టి కంచి మఠం వైపు మళ్లింది. ఇక శ్రీ జయేంద్ర సరస్వతి మరణం తర్వాత అయన స్థానంలో శ్రీ విజయేంద్ర సరస్వతి బాధ్యతలను స్వీకరించారు.