Movies

శివగామి పాత్రను వదులుకోవడానికి కారణం బోనీ కపూర్?

అతిలోక సుందరి శ్రీదేవి ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. దుబాయ్ లో ఒక వివాహానికి హాజరు అయిన శ్రీదేవి పమాదవశాత్తు మరణించింది. ఆమె కెరీరి లో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ఆమెకు ఎవరు సాటి రారని చాటి చెప్పింది. శ్రీదేవి తన కెరీర్ లో దాదాపుగా 300 సినిమాలను చేసింది. ఈ సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.

ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా కొన్ని సినిమాలకు నో చెప్పాల్సి వచ్చింది. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, చిరంజీవి, కృష్ణ ఇలా ఎంతో మందికి కొన్ని సార్లు శ్రీదేవి నో చెప్పింది. అయితే శ్రీదేవి నో చెప్పగా బ్లాక్‌ బస్టర్‌ అయిన చిత్రాలు రెండు ఉన్నాయి.

హాలీవుడ్‌ దర్శకుడు స్టివెన్‌ స్పిల్‌బర్గ్‌ 1993లో జురాసిక్‌ పార్క్‌ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రకు శ్రీదేవిని సంపాదించాడు. ఆమె కొన్ని కారణాల వలన నో చెప్పింది.

ఆ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో కనుక శ్రీదేవి నటించి ఉంటే అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చేది. జస్ట్ మిస్ చేసుకుంది.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో మొదట శ్రీదేవిని శివగామి పాత్ర కోసం సంప్రదించాడు. అయితే శ్రీదేవి నో చెప్పటంతో ఆ పాత్ర రమ్యకృష్ణకు దక్కింది. ఈ సినిమా రమ్యకృష్ణకు చాలా పేరును తెచ్చిపెట్టింది. ఈ రెండు సినిమాలు శ్రీదేవి చేసి ఉంటే ఇంకా చాలా అత్యున్నత స్థితిలో ఉండేది.

అయితే శివగామి పాత్రను రిజెక్ట్ చేయటానికి బోనీ కపూర్ కారణమట. బోనీ బాహుబలి నిర్మాతల ముందు దిమ్మతిరిగే పోయే రెమ్యునరేషన్ పెట్టాడట. అంతేకాక లాభాల్లో కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశాడట. దాంతో ఆ డిమాండ్‌ను తట్టుకోలేక ఆ ఆలోచనను మానుకొన్నారనేది అసలు విషయం.