Movies

శ్రియా భర్త మామూలోడు కాదు.. బ్యాక్‌ గ్రౌండ్‌ తెలిస్తే షాక్‌ అవుతారు

ముంబై బ్యూటీ.. సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన శ్రియా రీసెంట్‌గా సీక్రెట్‌ వెడ్డింగ్‌ చేసుకుందనే రూమర్‌ నేషనల్‌ వైడ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. గత కొన్నాళ్లుగా రష్యన్‌ ఫ్రెండ్‌ ఆండ్రీ కొశ్చీవ్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తోందనే రూమర్లు ఉన్నాయి. మార్చి ఎండింగ్‌లో ఆమె మ్యారేజ్‌ అవుతుందనే ప్రచారం జరిగింది. ఒకానొక దశలో 12వ తేదీన పెళ్లి చేసుకోనుందని కూడా ప్రచారం జరిగింది సడెన్‌ ట్విస్ట్‌ ఇస్తూ మార్చి 11వ తేదీన బంధువులు, ఫ్రెండ్స్‌తోపాటు నటుడు మనోజ్‌ బాజ్‌పేయ్‌, నటి షబానా అజ్మీల సమక్షంలో ఆమె పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రియా ఇలా తన పెళ్లిని గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది.

అయితే, శ్రియా ఊహించని విధంగా సర్‌ప్రైజ్‌ మ్యారేజ్‌ ఎందుకు చేసుకుందనేది ప్రస్తుతం ఎంత హాట్‌ టాపిక్‌ అయిందో, ఆమె భర్త ఆండ్రీ కొశ్చీవ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటనేది కూడా అదే రేంజ్‌లో ఆసక్తిగా మారింది. ఆండ్రీ కొశ్చీవ్ రష్యన్‌ జాతీయుడు. బేసిక్‌గా అతను టెన్నీస్‌ ప్లేయర్‌. టెన్నిస్‌లో జాతీయ స్థాయిలో ఆడాడు. బేస్‌ షాట్‌లు ఆడడంలో ఆయన దిట్ట.

టెన్నిస్‌ కెరీర్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టిన తర్వాత ఆండ్రీ బిజినెస్‌ స్టార్ట్‌ చేశాడు. ఆయన మల్టీబిలియనీర్‌. వేల కోట్లలో ఆస్తులు ఉన్నాయట. అంతేకాకుండా, ఫుడ్‌ బిజినెస్‌ అంటే ఇష్టం కావడంతో ఆండ్రీ రెస్టారెంట్‌ అండ్‌ ఫుడ్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రష్యాలో అది బాగా సక్సెస్‌ అయింది. తక్కువ పెట్టుబడితోనే షురూ చేసినా…. షార్ట్‌ టైమ్‌లో బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు.

ఇక, ఆండ్రీకి టెన్నీస్‌ తర్వాత అత్యంత ఇష్టమైన మరో క్రీడ వాటర్‌ సర్ఫింగ్‌. అవును, వాటర్‌ సర్ఫింగ్‌ చేయడం అంటే ఆయనకు చాలా ఇష్టమైన వ్యాపకం. చిన్నతనం నుంచే ఆండ్రీ గంటలకొలదీ నీటిలో గడిపేవాడు. శ్రియా, ఆండ్రీ పరిచయం విచిత్రంగా జరిగిందట. ఓ బిజెనెస్‌ పనిమీద ఇండియా వచ్చిన ఆండ్రీ, శ్రియాకి ఉన్న కామన్‌ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహ బంధం చిగురించడంతో అది ప్రేమగా మారి చివరకు ఇలా వివాహానికి దారితీసిందట. సినిమాలలో బిజీగా ఉన్న టైమ్‌లోనే శ్రియా మ్యారేజ్‌ చేసుకోవడం విశేషం. తెలుగు, తమిళ్‌లో ఆమె టాప్‌ హీరోలందరి సరసన నటించింది.