హీరో వేణు కెరీర్ డల్ అయినా ఆఖరికి డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు తెలుసా?

హీరో వేణు గుర్తున్నాడా? ఇప్పుడు వేణు గురించి మీకు తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వేణు ధార్వాడ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమా పరిశ్రమకు వచ్చాడు. మొదటగా భారతీరాజా దర్శకత్వంలో ఓ సినిమాలో కథానాయకుడిగా నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా కొన్ని అవాంతరాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. బి. గోపాల్ మేనల్లుడు అయినా వేణు మొదటగా టి. సుబ్బిరామిరెడ్డి తీసిన గ్యాంగ్ మాస్టర్ అనే సినిమా. ఈ సినిమాలో రాజశేఖర్,నగ్మా హీరో,హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో రాజశేఖర్ తమ్ముడు సెల్వ శేఖర్ కూడా నటించాడు.

గ్యాంగ్ మాస్టర్ సినిమా ప్లాప్ అయింది. ఈ సినిమాలో రాజశేఖర్ స్టూడెంట్ లలో ఒకడిగా వేణు కన్పిస్తాడు. ఆ తర్వాత బి. గోపాల్ సినిమాలలో కనిపించాడని అంటూ ఉంటారు. ఈ లోపు వేణు స్నేహితులు ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి వేణుతో కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో 1999లో స్వయంవరం తీశారు. ఇది వేణుకి హీరోగా మొదటి సినిమా.

స్వయంవరం సినిమా హిట్ కావటంతో వరుసగా సినిమా అవకాశాలు రావటంతో ఆ సినిమాలు హిట్ కావటంతో బండి గాడిలో పడినట్టే కనిపించింది. ఆ తర్వాత సినిమాలు ప్లాప్ కావటంతో చిన్న చిన్న పాత్రలు కూడా చేసాడు వేణు.

వేణు సినిమాల్లో నటిస్తున్నప్పుడే డబ్బింగ్ కూడా చెప్పేవాడు. తొట్టి గ్యాంగ్ , ఇంటిలో శ్రీమతి వీధిలో కుమారి సినిమాల్లో ప్రభుదేవాకి, వాన సినిమాలో సుమన్ కి డబ్బింగ్ చెప్పాడు.

వేణు ఒక పక్క వ్యాపారాలతో బిజీగా ఉంటూనే మరో పక్క సినిమాలను వదలకుండా డబ్బింగ్ చెపుతున్నాడు. మంచి పాత్ర వస్తే చేయటానికి సిద్ధంగా ఉన్నాడు వేణు.