Beauty Tips

Allergies:అలర్జీ తగ్గడానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు

Allergies Home remedies:శరీరంలో రోగనిరోధక శక్తి లోపించినప్పుడు స్కిన్ ఎలర్జీ వంటి వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు శరీరంలో ప్రతికూల చర్యలు జరిగినప్పుడు అలర్జీ వస్తుంది. ఎలర్జీ వచ్చినప్పుడు దురద, చర్మం ఎర్రగా మారడం, చర్మం పై మంట వంటి లక్షణాలు కనబడతాయి.

ఇలా ఎలర్జీ వచ్చినప్పుడు ముందుగా ఇంటి చిట్కాలు ట్రై చేయవచ్చు. అయితే ఎలర్జీ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే. ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో అలర్జీ నుండి ఎలా బయటపడవచ్చు చూద్దాం.

నిమ్మకాయ అలర్జీకి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నిమ్మకాయలు ఉండే యాంటీబ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై వచ్చే అలర్జీ తొలగిస్తాయి. ఎలర్జీ వచ్చిన భాగంపై నిమ్మకాయ సగానికి కట్ చేసి రుద్దాలి. ఈ విధంగా చేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

కలబంద కూడా ఎలర్జీ కి ఒక మంచి ఇంటి చిట్కా అని చెప్పవచ్చు. అలర్జీ ఉన్న ప్రదేశంలో లో కలబంద రాస్తే దురద మరియు ఎరుపు నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. మన ఇంట్లో పెంచుకునే కలబంద జెల్ అయినా వాడవచ్చు. మార్కెట్లో దొరికే జెల్ అయినా వాడవచ్చు.

వేప కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వేపలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు దురదలు, దద్దుర్లు వంటి వాటికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.