పవన్ మొదటి భార్య నుండి ఎందుకు విడిపోయాడో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో ఎన్నో మరుపురాని విజయాలను సాధించిన అయన వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఎత్తుపల్లాల మయమని చెప్పవచ్చు. జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ ని ఇబ్బంది పెట్టటానికి అయన రాజకీయ ప్రత్యర్ధులు ఎక్కువగా పర్సనల్ మేటర్స్ నే ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రధానంగా అయన చేసుకున్న మూడు పెళ్ళిళ్ళను ఎత్తి చూపుతూ విమర్శలు చేస్తూ ఉంటారు. రోల్ మోడల్ గా ఉండవలసిన వ్యక్తి ఇన్ని పెళ్లిళ్లు చేసుకొని ప్రజలకు ఏమి సందేశం ఇస్తాడని విమర్శిస్తూ ఉంటారు. పెళ్లి అనేది తన పర్సనల్ వ్యవహారం అని భావించే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు వాటిపై ఎక్కడ వివరణ ఇవ్వలేదు.

అయితే జనసేన పార్టీలో కీలకంగా ఉన్న అద్దేపల్లి శ్రీధర్ ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ కళ్యాణ్ వివాహాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ మొదట పెళ్లి చేసుకున్న అమ్మాయితో కేవలం నెల రోజులు మాత్రమే కల్సి ఉన్నారని చెప్పారు.

ఆ తర్వాత ఆమె పవన్ ని ఇల్లరికం రమ్మని కోరిందని ఆ ప్రతిపాదన పవన్ కి ఇష్టం లేకపోయిందని తెలిపారు. తన కుటుంబానికి ఎంతో విలువ ఇచ్చే పవన్ తాను ఎవరో ఇంటికి ఇల్లరికం అల్లుడిగా వెళ్ళటం భరించలేక పోయాడని, తనకంటూ సొంత వ్యక్తిత్వం ఉన్న అయన ఇల్లరికం అల్లుడిగా తనకు తాను ఉహించుకోలేకపోయారని శ్రీధర్ చెప్పారు.

పదేళ్ల పాటు ఆమెకు దూరంగా ఉన్న పవన్ ఎవరికీ ఇబ్బంది కలిగించకుండానే విడిపోయాడని చెప్పారు. జనసేనలో కీలకంగా ఉన్న అద్దేపల్లి శ్రీధర్ గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా కీలక నేతగా ఉన్నారు. హైకోర్టు న్యాయవాదిగా పేరుగాంచిన ఆయనకు రాజమండ్రిలో చాలా విద్యాసంస్థలు ఉన్నాయి.

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యాక శ్రీధర్ బిజెపిలోకి వెళ్లారు. ఇప్పుడు జనసేనలో చేరి కీలకమైన వ్యక్తిగా మారారు. AP కి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరాశ చెందిన అయన బిజెపిని వదలి జనసేనలోకి చేరారు. ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే పవన్ అంటే మండిపడే కత్తి మహేష్ కి అద్దేపల్లి శ్రీధర్ కి మంచి స్నేహం ఉండనే ప్రచారం కూడా ఉంది.