Politics

యుద్ధం చేస్తుంది భీష్ముడు కాదు సాక్షాత్ శ్రీ కృష్ణుడే

జనసేన అధినేత నటుడు పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీ నుంచి క్రమేణా మద్దతు పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ తల్లిని దూషిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే సినీ రంగ ప్రముఖులు,పవన్ సన్నిహితులు మండి పడుతున్నారు. పవన్ ని టార్గెట్ చేసుకోమని శ్రీరెడ్డికి తానే చెప్పానని వర్మ మరో బాంబు పేల్చటంతో ఇండస్ట్రీలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఫిల్మ్ ఛాంబర్ వద్దకు వచ్చి నిరసన తెలియజేసిన పవన్ కళ్యాణ్ కి మద్దతుగా అయన ఫాన్స్ చేసిన హంగామా ఏ పాటిదో తెలిసిందే.

ఈ నేపథ్యంలో యాంకర్,క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్యామల పవన్ కి సపోర్ట్ చేస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. శిఖండిని అడ్డు పెట్టటానికి భీష్ముడు కాదు… పద్మవ్యూహం పన్నడానికి అభిమన్యుడు కాదు. యుద్ధం చేస్తుంది సాక్షాత్ శ్రీ కృష్ణుడే…జాగ్రత్త అని ట్వీట్ చేసింది శ్యామల.