మెగా ఫ్యామిలీ కోసం పవన్ త్యాగం..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల సమయానికి మరింత బలపడాలని ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు పవన్. పవన్ ఒక్కో మెట్టు ఎక్కే కొలది విమర్శల దాడి కూడా అలాగే పెరుగుతుంది. అయినా పవన్ ఏ మాత్రం తగ్గకుండా రాజకీయ పార్టీలు,నాయకులనే కాదు తన మీద దాడి చేసిన మీడియాను వదలటం లేదు. పవన్ చేసిన మిడియా పోరాటంలో చిరంజీవి సైతం నేనున్నా అంటూ పవన్ కి అండగా నిలిచారు. ఇదంతా పవన్ కోసం కాదు జనసేన పార్టీ ప్రజల్లో ఉంటే బాగుంటుందని చిరు భావిస్తున్నారు. పవన్ రాజకీయాల్లో ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత బాగుంటుందని చిరు భావిస్తున్నారని సమాచారం.
తాను కాంగ్రెస్ లో ఉన్నా సరే తమ్ముడికి ఆపద వస్తే ఆదుకోవటానికి రెడీగా ఉన్నానని చెప్పకనే చెప్పారు మెగాస్టార్. ఒకసారి అధికారం రుచి చూసిన చిరంజీవి రాజకీయ విలువ,అధికార శక్తి గురించి తెలియంది కాదు. MLA నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన ఆయనకు రాజకీయంలో ఉన్న పవర్ మరెక్కడా ఉండదని గ్రహించారు.
అందుకే మరల తాను సినిమాల్లోకి వచ్చిన పవన్ రాజకీయాల్లో ఉంటే బెటర్ అనే అభిప్రాయంలో పడ్డారట చిరంజీవి. రాజకీయాలలో ఉంటే వ్యక్తిగత సమస్యలను తీర్చుకోవటమే కాదు ఎలాంటి సమస్యలు,ఆపదలు వచ్చిన నిమిషాల్లో పరిష్కారం దొరుకుందని చిరు భావన.
తప్పులు చేయకపోయినా చిరంజీవి,పవన్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయటానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఎవరో ఒకరు రాజకీయాల్లో ఉంటే మన జోలికి రారని అయన భావిస్తున్నారట. బయట ఉంటేనే మెగా కుటుంబాన్ని అందరు టార్గెట్ చేస్తున్నారు.
అలాంటిది రాజకీయ నాయకులకు దూరంగా ఎవరి జోలికి పోకుండా ఉన్నా సరే రాళ్లు వేస్తారని మెగా కుటుంబం భావిస్తోందట. సినిమాలు మానేసి జనం కోసం ఏమైనా చేస్తానని జనంలోకి వెళ్లిన పవన్ కు మెగా కుటుంబం అడ్డు చెప్పలేదట.
ఒకవేళ పవన్ కి అడ్డు చెప్పిన వినే తత్త్వం పవన్ కి లేదు. తాను ఏది అనుకుంటే అదే చేస్తాడు. అందుకే తాను జనసేన పార్టీ పెట్టినప్పుడు చిరు సమర్ధించారట. నీకు నేను తోడు ఉంటా…నాకు చేతనైనంత సాయం చేస్తా అని చిరు పవన్ కి చెప్పారట.
అందుకే పార్టీలతో సంబంధం లేకుండా మీడియాతో వివాదం తలెత్తినప్పుడు చిరు నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు. అలాగే పవర్ స్టార్ కు మెగా కుటుంబాన్ని కలుపుకుంటూ ముందుకు వెళుతున్నాడు. గత ఆరు నెలల నుండి పవన్ చిరు ఇంటికి తరచుగా వచ్చి వెళుతున్నాడు. అంతకు ముందు చిరు ఇంటికి పవన్ పెద్దగా వచ్చేవాడు కాదు. కాస్త గ్యాప్ పెరిగిందనే వార్తలు కూడా వచ్చాయి.