Politics

పవన్ వ్యూహాత్మక మౌనం..!!

పవన్ కళ్యాణ్ ఏ పని చేసిన చాలా ఆవేశంగాప్రారంభిస్తారు . మొదట్లో ఆరడగుల బులెట్ లా,నిప్పులు చిమ్మే రాకెట్ లా దూసుకుపోయే రకం. కొంత కాలం అయ్యాక ఆ దూకుడు,ఆవేశం కన్పించవు. సుదీర్ఘ పోరాటానికి ఓపిక,సహనం కావాలని తన మౌనానికి కారణం చెప్పే పవన్ ఒక్కోసారి పూర్తిగా అజ్ఞాతవాసి అయ్యిపోతారు. శ్రీరెడ్డి తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం వెనక టీడీపీ నేతలు, మీడియా సంస్థల కుట్ర ఉందని ఆరోపించిన పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్స్,ప్రెస్ మీట్స్ తో వేడి పుట్టించారు. పవన్ డైరెక్ట్ ఎటాక్ తో కొన్ని రోజులు టీడీపీ నేతల్లో రైళ్లు పరిగెత్తాయి. ముఖ్యంగా చంద్రబాబు కేంద్రంపై ధర్మ పోరాట దీక్ష చేసిన రోజే పవన్ కళ్యాణ్ తన దాడి ప్రారంభించటంతో BJP డైరెక్షన్ తోనే ఆ రోజు పవన్ ట్వీట్ ల దాడి చేశారనే వాదనలు వినిపించాయి.

కానీ తిరుపతిలో తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి స్పందన లేదు. దీనితో BJP డైరెక్షన్ తోనే పవన్ టీడీపీ పై వార్ ప్రారంభించారనే వార్తల్లో పస లేదని తేలిపోయినట్టే.

అదే విధంగా శ్రీరెడ్డి తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం,దాని వెనక నేనున్నాను అని వర్మ చెప్పటంతో ఆ బాధతోనే పవన్ కళ్యాణ్ ఆవేశంగా రియాక్ట్ అయినట్టు అయన అభిమానులు భావిస్తున్నారు. అంతే తప్ప దీనిలో ఎటువంటి రాజకీయాలు లేవని వారి అభిప్రాయం.

మరో వైపు ఏ విషయంలోనైనా పవన్ కళ్యాణ్ ది ఆరంభ సురత్వమే అనే విమర్శిస్తున్నారు అయన ప్రత్యర్ధులు. ఆరంభంలో ఆవేశంతో రెచ్చిపోయే పవన్ ఆ తర్వాత అదృశ్యం కావటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

సినిమాల్లో షాట్ కి,షెడ్యూల్ కి ఒకసారి బ్రేక్ తీసుకొనే విధముగా రాజకీయాల్లో బ్రేక్ తీసుకుంటే కుదరదని వారి వాదన. అంతేకాదు ఒక వ్యూహం లేకుండా ఆవేశంగా మాట్లాడి,ఆ తర్వాత సైలెంట్ అయ్యిపోతే రాజకీయంగా ముందుకు వెళ్ళటం కష్టమని చెప్పుతున్నారు.

ఎన్నికలు దగ్గరగా ఉండటంతో జనసేన పార్టీని ప్రజల్లోకి బ్రేక్ లేకుండా చాలా స్పీడ్ గా తీసుకువెళ్లాలని పవన్ అభిమానులు,జనసేన పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. మరి పవన్ ఏమి చేస్తారో చుడాలి.