‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి కోడలుగా నటించిన ‘ఈ నటి’ ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరొయిన్నో తెలిస్తే షాక్
తెలుగు సినీ రంగంలో తమకంటూ డబ్బు,పేరును సంపాదించుకోవాలని ఎంతో మంది నటీనటులు ఎన్నో ఆశలతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన చాలా మందిని చూసే ఉంటాం. మన తెలుగులో హీరోయిన్స్ గా మంచి అవకాశాలు రాక తమిళ,మలయాళ,కన్నడ రంగంలోకి వెళ్లి పాపులర్ అయినవారు కూడా ఉన్నారు. ఇపుడు మనం తెలుగులో పెద్దగా గుర్తింపు రాక మలయాళీ సినిమా రంగంలోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అక్కడ సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపుతుంది. ఆమె ఎవరో కాదు హీరోయిన్,క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన లక్ష్మి శర్మ అలియాస్ లహరి. లహరి పుట్టి పెరిగింది విజయవాడలో. తల్లితండ్రులు ఇద్దరూ గవర్నమెంట్ ఉద్యోగులు.
లహరికి చిన్నతనం నుండి సినిమాల్లోకి రావాలనే కోరిక ఉండేది. తన కలను నిజం చేసుకోవటానికి డిగ్రీ అవ్వగానే కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చేసింది. ఆలా ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చిన లహరి తన ఫోటోలను,ప్రొఫైల్ పట్టుకొని సినిమాల్లో ఒక్క ఛాన్స్ అంటూ స్టూడియోల చుట్టూ తిరిగింది.
చివరకు ఆమె కష్టానికి ఫలితంగా E.V.V. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆమ్మో ఒకటో తారీఖు సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ సినిమాలో ఛాన్స్ అయితే వచ్చింది కానీ, ఆ సినిమా ఆమెకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు.
ఆ తర్వాత ఏ మాత్రం నిరాశ పడకుండా ఎలాగైనా తాను హీరోయిన్ గా నటించాలని వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా కొన్ని B గ్రేడ్ సినిమాల్లో కూడా నటించింది.
ఆమె ఆలా నటిస్తూ ఉండగా ఇంద్ర సినిమాలో అవకాశం వచ్చింది. ఈ పాత్ర మంచి నటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో చిరంజీవి మేనకోడలిగా హీరోయిన్ సోనాలి బింద్రే స్నేహితురాలిగా నటించింది లహరి. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో తన కెరీర్ కి మంచి బ్రేక్ వస్తుందని ఆశించింది లహరి.
కానీ ఆమె ఆశలు అన్ని బూడిదలో పోసిన పన్నీరే అయినాయి. ఆ తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు ఏమి రాలేదు. ఆమె మలయాళంలో మొదటి సినిమాలోనే మమ్ముట్టి సరసన హీరోయిన్ గా నటించింది. ఇక ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో ఆమె అక్కడ టాప్ హీరోయిన్ గా మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది.
ఆలా మలయాళంలో టాప్ హీరోలతో నటిస్తూ మంచి స్టార్ డమ్ ని సంపాదించుకొని ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. లహరికి తెలుగులో రాని స్టార్ హీరోయిన్ హోదా మలయాళ రంగంలో సాధించింది.