Movies

భరత్ అనే నేనులో నటించిన ఈ రాహుల్ ఎవరి కొడుకో తెలుసా!

అర్జున్ రెడ్డి సినిమా ఎంతో ఘన విజయం సాధించింది. ఆ సినిమా పూర్తి సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడు సందీప్ రెడ్డికి దక్కింది. ఇలాంటి బోల్డ్ కథతో సినిమా చేయటానికి చాలా దైర్యం కావాలి. కానీ సందీప్ స్టామినాతో తీసి హిట్ కొట్టాడు. అర్జున్ రెడ్డి సినిమా ఇంత ఘన విజయం సాధించిందంటే విజయ్ దేవరకొండ నటనే అని చెప్పవచ్చు. ఆ పాత్ర అతను తప్ప ఎవరు చేయలేరనే విధంగా విజయ్ చేసి అదరకొట్టాడు. ఇక అర్జునరెడ్డి సినిమాలో విజయ్ తర్వాత అంతలా ఆకట్టుకున్న నటుడు హీరో స్నేహితుడుగా నటించిన రాహుల్ రామకృష్ణ. విజయ్ గత సంవత్సరం నటించిన పెళ్లిచూపులు సినిమాలో ప్రియదర్శి తెలంగాణ స్లాగ్ తో ఆకట్టుకున్నాడో… అలాగే అర్జున్ రెడ్డి సినిమాలో శివ పాత్రను పోషించిన రాహుల్ రామకృష్ణ కూడా అలాగే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ రుపొంచించిన షార్ట్ ఫిలిం లో రాహుల్ ప్రధాన పాత్ర పోషించాడు. ఆ పాత్రతో రాహుల్ కి మంచి పేరు వచ్చింది. పెళ్లిచూపులు ఫెమ్ ప్రియదర్శి లాగానే రాహుల్ కూడా సినిమాల్లో బిజీగా మారే అవకాశాలు చాలానే ఉన్నాయి.

ఇప్పుడు భరత్ అనే నేను సినిమాలో రాయలసీమ యువకుడిగా మహేష్ అండదండలతో MLA గా నిలిచే పాత్రను చేసాడు రాహుల్. ఈ సినిమాలో అతని నటన అందరిని మెప్పించింది. దాంతో రాహుల్ కి వరుస అవకాశాలు దక్కనున్నాయి.

రాహుల్ రామకృష్ణ పుటింది పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. నాన్న సుభ్రహ్మణ్యం,అమ్మ షీలా. వీరిది మధ్యతరగతి కుటుంబం. పేదరికం కారణముగా ఇంటర్ నుంచే రాహుల్ పని చేస్తూ చదువుకున్నాడు. డేటా ఎంట్రీ ఆపరేటర్ గా, వెబ్సైట్ లకు కంటెంట్ రైటర్ గా పనిచేసాడు.

రాజకీయ నాయకులకు రికమండేషన్ లెటర్స్ రాసే పనిలో చేరాడు. అందుకు రాహుల్ అందుకున్న తోలి జీతం 3000. ఆ తర్వాత ఎంతో కస్టపడి టీవీలో వంటల కార్యక్రమాలు,షార్ట్ ఫిలిమ్స్ తీసి,చివరకు సందీప్ తో పరిచయం కారణముగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ఇప్పుడు భరత్ అనే నేను సినిమాలో అద్భుతమైన నటనతో ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోయాడు.