Movies

మెగాస్టార్ బరువు ఎంతో తెలుసా?

మెగాస్టార్ నట జీవితంలో ‘మగ మహారాజు’ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. నటుడిగా చిరంజీవిని రెండు మెట్లు ఎక్కించిన సినిమా. ఈ సినిమాకి దర్శకుడు విజయబాపినీడు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా సుహాసిని నటించారు. ఈ సినిమాకి సంబందించి ‘నెలలు నిండినా కనక మానదు’ అనే పాటను చెన్నైలోని వి.జి.పి. లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ పాటను సుహాసిని,చిరంజీవి మీద తీస్తున్నారు. ఈ పాటలో ఓ చోట సుహాసినిని చిరంజీవి ఎత్తుకొంటారు. మరో చోట కూడా అలాంటి సందర్భరమే రావడంతో ‘ఏం .. ఎప్పుడూ హీరోయిన్‌ను హీరో ఎత్తుకోవడమేనా.. వెరైటీగా ఈసారి నేను మిమ్మల్ని ఎత్తుకొంటాను’ అన్నారు.

చిరంజీవి భయం నటిస్తూ.. ‘నిజంగా ఎత్తుకొంటావా.. లేక నన్ను కింద పడెయ్యాలనుకొంటున్నావా’ అన్నారు. ‘మీరేం భయపడకండి.. కింద పడెయ్యను.. చూడండి’ అని అమాంతం చిరంజీవిని ఎత్తుకొన్నారు సుహాసిని. వెంటనే ఆ షాట్‌ను తన కెమెరాలో బంధించారు ఛాయాగ్రాహకుడు లోక్‌సింగ్‌.
Maga Maharaju Movie Chiranjeevi, Suhasini
షాట్‌ పూర్తవగానే చిరంజీవిని కిందకు దించేసి..‘ పెద్ద బరువేం లేరు మీరు.. తేలికగానే ఎత్తుకోవచ్చు’ అన్నారు సుహాసిని. ‘అవును.. నువ్వు బలవంతురాలివే’ అని కాంప్లిమెంట్‌ ఇచ్చారు చిరంజీవి. పక్కనే ఉన్న స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ నారాయణరావును పిలిచి ‘ వెరైటీగా ఉంటుంది.. స్టిల్‌ తియ్యి’ అని చెప్పారు. స్టిల్‌ కోసం మరోసారి చిరంజీవిని ఎత్తుకొన్నారు సుహాసిని.