Movies

చిరంజీవిని హీరోగా చేసిన అపురూపమైన ఇల్లు ఇదే

మెగాస్టార్ చిరంజీవి ఎన్నో మైలు రాళ్లను దాటుకొని ఈ స్థాయికి చేరారు. ప్రసుతం మెగా స్టార్ పేరు చెప్పితే ఒక పెద్ద సినీ కుటుంబమే గుర్తుకువస్తుంది. తెలుగు సినిమా చరిత్రలోనే ఇంతలా కళామతల్లితో బంధం పెనవేసుకున్న అతి కొద్ది కుటుంబాలలో మెగాస్టార్ ది ఒకటి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొణెదల శివశంకర వరప్రసాద్ గా మొదలు అయ్యి చిరంజీవిగా,మెగాస్టార్ గా ఎదిగిన క్రమం ప్రతి ఒక్క కళాకారుడికి ఆదర్శప్రాయం. ప్రస్తుతం చిరంజీవి పెద్ద పెద్ద బంగ్లాలు, బెంజి కార్లను తమ కుటుంబం మొత్తానికి కల్పించి ఉండవచ్చు. కానీ తాను మాత్రం చిన్నతనం,యుక్తవయస్సులో ఎన్నో కష్టాలను పడ్డాడు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ ఇల్లు. నెల్లూరు పట్టణంలో నేటికీ చెక్కు చెదరకుండా ఆ నాటి జ్ఞాపకాలకు సజీవ సాక్షిగా ఈ ఇల్లు నిలుస్తుంది.

చిరంజీవి తన విద్యాబ్యాసం అంతా ఇక్కడే పూర్తి చేసారు. డిగ్రీని పూర్తి చేసే సమయంలో చిరంజీవి తండ్రి కొణెదల వెంకట్రావ్ నెల్లూరు లో ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్ లో CI గా పనిచేసారు. అప్పుడు వెంకట్రావ్ గారు ఈ ఇంటిలోనే ఉండేవారు. ఇక్కడే చిరంజీవి,నాగబాబు,పవన్ కళ్యాణ్ పెరిగారు.

ఈ ఇంటి నుంచే చిరంజీవి సినీ ప్రయాణం ప్రారంభం అయింది. నెల్లూరు నుంచి 176 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాటి మద్రాస్ కు నేటి చెన్నైకి చిరంజీవి ఈ ఇంటి నుంచే వెళ్లి వస్తూ ఉండేవారు. సినిమా ప్రయత్నాలు చేసేందుకు నెల్లూరు నుంచి నేషనల్ హైవే 16 మీదుగా చిరంజీవి మద్రాస్ కి వెళ్లేవారు.

ఒక్కోసారి తన తండ్రి దగ్గర ఉన్న బులెట్ పై చిరంజీవి మద్రాస్ కి వెళ్లేవారు. ఒక విధంగా చెప్పాలంటే సినిమాలపై చిరుకి ఆసక్తి కలగటానికి ఈ ఇల్లే కారణమని చెప్పవచ్చు. నెల్లూరు వాసులకు మద్రాస్ అత్యంత దగ్గరగా ఉండటంతో ప్రతి పనికి మద్రాస్ కి ఎక్కువగా వెళ్లేవారు.

నాడు సినీ పరిశ్రమ మొత్తం మద్రాస్ లోనే ఉండటంతో ఎక్కువగా సినీ రంగంలో నెల్లూరు వారే స్థిరపడ్డారు. అలాగే చిరంజీవి కూడా ఉద్యోగ ప్రయత్నం కోసం వెళ్లి సినిమాలపై ఆసక్తితో ప్రయత్నాలు మొదలు పెట్టారు. పునాది రాళ్ళూ సినిమా నుంచి చిరు సినీ ప్రస్థానము మొదలై సైరా నరసింహారెడ్డి వరకు సక్సెస్ గా సాగుతుంది.

ఇప్పుడు చిరు కుటుంబం నుండి నాగబాబు,పవన్ కళ్యాణ్,రామ్ చరణ్,అల్లు అర్జున్,శిరీష్,సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా జాభితా పెరుగుతూ వెళుతూనే ఉంది. అది ఈ ఇంటికి ఉన్న చరిత్ర. ఈ ఇంటిలో మొన్నటి వరకు చిరంజీవి బాబాయ్ ఉండేవారు. అయన పిల్లలు విదేశాలలో స్థిరపడటంతో అయన అక్కడకు వెళ్లిపోవటంతో, ఈ ఇంటిని చిరంజీవి కుటుంబసభ్యులు అమ్మేసారు.

ఈ ఇంటిని కొనుగోలు చేసిన నెల్లూరు వాసి రూపురేఖలు మార్చకుండా అలానే ఉంచారు. ఎంతైనా ఒక లెంజెండ్ నివసించిన ఇల్లు కావటంతో ఆ ఇంటిని అలానే ఉంచేస్తేనే ఆయనకు గౌరవమని ప్రస్తుత ఇంటి యజమాని భావిస్తున్నారు.