దయనీయ పరిస్థితిలో ఉన్న జబర్దస్త్ కమెడియన్ ని ఆదుకున్న సుడిగాలి సుదీర్
సుడిగాలి సుదీర్ జబర్దస్త్ షో ద్వారా ఇప్పుడు టాప్ రేటింగ్ లో ఉన్న క్రేజీ స్టార్ గా బుల్లితెరలో మారాడు. సుడిగాలి సుదీర్ జబర్దస్త్ తో పాటు అనేక రకాల స్టేజ్ షో లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. సాధారణమైన కుటుంబంలో జన్మించిన సుదీర్ కష్టాలు ఎన్నో పడి చివరికి మెజీషియన్ గా తనకున్న సత్తాను చాటుకోవడానికి కొన్ని ప్రయత్నాలను చేసిన….దానిలో కూడా ఏ మాత్రం ఎదుగుదల లేకపోవటంతో ఎలాగైనా జబర్దస్త్ లోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేసేవాడు. ఒకసారి జబర్దస్త్ షో లో వేణు టీమ్ లో ఒక పర్సన్ రాకపోవటంతో…అప్పటికే సుడిగాలి సుదీర్ తో పరిచయం ఉన్న వేణు ఆ ఒక్కరోజు గెస్ట్ ఎప్పీరియన్స్ కి రమ్మని సుదీర్ కి చెప్పాడట.
ఆ ఫస్ట్ షో లో అందరిని మెప్పించటంతో వెనక్కి తిరిగి చూసే అవకాశం రాలేదు సుడిగాలి సుదీర్ కి. అప్పటి నుంచి సుదీర్ తన కెరీర్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. జబర్దస్త్,పోవే పోరా, ఢీ 10 వంటి షో లు చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఇది ఇలా ఉంటే తనకు ఈ స్థాయి రావటానికి కారణం అయినా వేణుని జీవితంలో మర్చిపోనని,దైవంతో సమానమని అనేక ఇంటర్వ్యూ లలో చెప్పటమే కాకుండా సమయం వచ్చిన ప్రతి సారి చెప్పుతూ ఉంటాడు సుడిగాలి సుదీర్.
ఈ మధ్య కాలంలో వేణుకి సరైన అవకాశాలు లేకపోవటం,ఆర్ధికంగా కాస్త ఇబ్బందులు ఉన్నాయి. ఆ పరిస్థితిని తెలుసుకొన్న సుదీర్ వేణు ఇంటికి వెళ్లి ఈ తమ్ముణ్ణి మర్చిపోయావా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడట. సుదీర్ వేణుకి అండగా నిలిచాడట. అలాగే ఏ సాయం కావాలన్నా అడగమని చెప్పాడట.