Movies

అల్లు అర్జున్‌ ప్లాన్‌ అదుర్స్‌.. నువ్వు సూపర్‌ ఎహే!

వరుస విజయాలతో దాదాపు రెండు సంవత్సరాలుగా అల్లు అర్జున్‌ జోరు మీదున్నాడు. వరుసగా నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్‌ అయిదవ విజయాన్ని నా పేరు సూర్య చిత్రంతో దక్కించుకుంటాడని అంతా భావించారు. కాని అనూహ్యంగా అల్లు అర్జున్‌ నా పేరు సూర్య చిత్రంతో ఫ్లాప్‌ను మూట కట్టుకున్నాడు. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం విఫలం అయ్యింది. బన్నీ చాలా అంచనాలు పెట్టుకుని చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను రీచ్‌ కాలేక పోయింది. అందుకే అల్లు అర్జున్‌ తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’ చిత్రం సక్సెస్‌ అయితే తన తదుపరి సినిమాగా ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని చేయాలని మొదటి నుండి అనుకున్నాడు. కాని ప్రస్తుతం ఆ ఆలోచనను విరమించుకున్నాడు. నా పేరు సూర్య చిత్రంతో ఫ్లాప్‌ అయిన తాను ఇప్పుడు ప్రయోగం పేరుతో మరో ఫ్లాప్‌ను చవి చూస్తే కెరీర్‌ కష్టాల్లో పడుతుందనే ఉద్దేశ్యంతో కమర్షియల్‌, ఎంటర్‌టైనర్‌గా తన తదుపరి చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు.

అందుకు సంబంధించిన చర్చు జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో చేయాలని భావించిన బన్నీ ఇప్పుడు మరో దర్శకుడిని వెదికే పనిలో ఉన్నాడు.‘మనం’, ‘24’ చిత్రాతో విభిన్న చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విక్రమ్‌ కుమార్‌ తాజాగా బన్నీ కోసం ఒక కథను సిద్దం చేయడం జరిగింది.

కాని ప్రస్తుతానికి ఆ కథను పక్కకు పెట్టాలని బన్నీ భావిస్తున్నాడు. త్వరలోనే అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రాన్ని హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. డీజే వంటి విభిన్న కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తనకు సక్సెస్‌ను ఇచ్చిన హరీష్‌ శంకర్‌తో మరో కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సిద్దం అవుతున్నాడు.

అల్లు అర్జున్‌ నుండి ప్రేక్షకులు కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆశిస్తున్నారు. అందుకే బన్నీ తన తదుపరి చిత్రంగా ఒక మంచి కమర్షియల్‌ సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలని భావిస్తున్నాడు. అలాంటి కమర్షియల్‌ స్టోరీ లైన్‌ గతంలో హరీష్‌ శంకర్‌ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ దాగుడు మూతలు అనే మల్టీస్టారర్‌ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
Allu Arjun
కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్‌ కావడం లేదు. ఆ కారణంగానే బన్నీతో సినిమాను చేసేందుకు ఆయన ముందుకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదే సంవత్సరంలో బన్నీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాడు.