Movies

జెమినీ గణేశన్ పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా?

తమిళనాట కాదల్ మన్నన్ గా గుర్తింపు పొందిన జెమినీ గణేశన్ అలమేలు, పుష్పవల్లి, సావిత్రి, జూలియానాలను పెళ్లిచేసుకున్నారు. మొదటి ముగ్గురు భార్యల ద్వారా జెమినీ ఏడుగురు కుమార్తెలను ఓ కుమారుడ్ని పొందారు. శాస్త్రబద్ధంగా వివాహం చేసుకున్న మొదటి భార్య అలమేలు ద్వారా జెమినీ గణేశన్ కు కమల, రేవతి, జయలక్ష్మి, నారాయణి అనే కుమార్తెలు జన్మించారు. వీరిలో కమల, రేవతి, జయలక్ష్మి ప్రముఖ వైద్యులుగా పేరుతెచ్చుకున్నారు. నాలుగో కుమార్తె నారాయణి టైమ్స్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్టుగా స్థిరపడ్డారు.

ఇక, రెండో భార్య పుష్పవల్లి. తెలుగు సినిమా మొదలైన కాలంలో ఆమె ప్రముఖనటిగా పేరు తెచ్చుకున్నారు. జెమినీ, పుష్పవల్లి దంపతులకు రేఖ, రాధ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో రేఖ అందరికీ తెలిసిన అందాలతార. రేఖ తన అందచందాలతో అభినయంతో బాలీవుడ్ లో స్టార్ డమ్ తెచ్చుకుంది. రాధ కొన్ని చిత్రాల్లో నటించి పెళ్లిచేసుకుని యూఎస్ లో సెటిలైపోయింది.

ఆ తర్వాత సావిత్రిని పెళ్లిచేసుకున్న జెమినీ గణేశన్ కు విజయచాముండేశ్వరి, సతీష్ అనే పిల్లలు కలిగారు. వారిలో విజయచాముండేశ్వరి ఫిజియోథెరపిస్ట్ కాగా, సతీష్ కూడా ఉన్నతస్థాయిలో స్థిరపడ్డాడు. సావిత్రి మరణానంతరం బాగా వయసు ముదిరిపోయాక 79 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి చేసుకున్న జెమినీ గణేశన్ తన నాలుగో భార్య ద్వారా పిల్లలు కనలేదు. వారి దాంపత్యం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. అన్ని విధాలా జెమినీ గణేశన్ ను ముంచిన నాలుగో భార్య జూలియానా కొన్నాళ్లకే విడిచిపెట్టి వెళ్లిపోయింది.

అయితే, ముందు భార్యల ద్వారా కన్న పిల్లలు మాత్రం ఇప్పుడు తమ తమ రంగాల్లో ఎంతో పేరుతెచ్చుకుని లైఫ్ లో చక్కగా సెటిలయ్యారు. తన విచ్చలవిడితనంతో భార్యలకు కడగళ్లు మిగిల్చిన ఈ రొమాంటిక్ కింగ్ తన పిల్లలకు మాత్రం మంచి భవిష్యత్తునే ఇవ్వడం విశేషం అనే చెప్పుకోవాలి.