Politics

అఖిల ప్రియ మొదటి భర్త ఎవరి కొడుకో తెలుసా?

భూమా అఖిల ప్రియ రాయలసీమలోని కర్నూల్ జిల్లాలో ఒక వెలుగు వెలిగిన భూమా నాగిరెడ్డి కూతురుగా అందరికి తెలుసు. భూమా నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డి అకాల మరణంతో తప్పనిసరి పరిస్థితుల్లో భూమా అఖిల ప్రియా రాజకీయాల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మంత్రిగా రాణిస్తుంది. అయితే అఖిలప్రియ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. భూమా అఖిల ప్రియకు ఇటీవలే నిశ్చితార్ధం జరిగింది. అయితే చాలా మందికి ఆమె మొదటి వివాహం గురించి తెలియదు. ఎందుకంటే అఖిల ప్రియా రాజకీయాల్లోకి రాక ముందే వివాహం అయింది. విడాకులు కూడా అయ్యాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె మొదట పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు Y.S.రాజశేఖరరెడ్డి బావమరిది అయినా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రవీంద్ర రెడ్ది కొడుకుని.

Y.S,భూమా కుటుంబాల మధ్య అనుంబంధం కారణంగా ఈ సంబంధం కుదిరింది. అయితే పెళ్లి అయినా కొన్ని రోజులకే వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవటంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆమె విడాకులు తీసుకున్నాక మరల వివాహం చేసుకుంటుందా లేదా అనే విషయంపై అనుమానాలు ఉండేవి.

అఖిల ప్రియా ఇటీవలే నిశ్చితార్ధం చేసుకోవటంతో ఆ అనుమానాలు అన్ని పటాపంచలు అయ్యాయి. అఖిల ప్రియా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు భార్గవ్. అతను మాజీ DGP సాంబశివరావుకి మాజీ అల్లుడు. భార్గవ్ కి కూడా రెండో వివాహమే.