Politics

17 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ని వదలని సేంట్ మెంట్ ఇదే !

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమా రంగానికి పరిచయం అయ్యి ఆ తర్వాత సునామి రేంజ్ లో ఎదిగిపోయిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే తానేమిటో నిరూపించుకోవటంతో సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ బిల్డప్ అయింది. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నాడు. కొంతకాలం క్రితం పవన్ జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమాతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా రాజకీయాలకు సమయాన్ని కేటాయిస్తున్నారు. పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పినపుడు అభిమానులు కాస్త బాధ పడినా ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో ఉంటే ఎక్కువగా తమ మధ్యనే ఉంటాడని ఆనందపడ్డారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర కోసం సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే అయన ఉద్యమాలకు పుట్టిల్లు అయినా శ్రీకాకుళం నుండి యాత్ర చేపడుతున్నారు. దాని కోసం పవన్ చాలా నిరాడంబర రీతిలో సిద్ధం అయ్యారు. ఒక పాత బ్యాగ్ లో తనకు సంబందించిన వస్తువులు,పుస్తకాలను ఉంచుకొని వైజాగ్ చేరుకున్నారు.

ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న ఆ బ్యాగ్ పైనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ బ్యాగ్ ని పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా నుండి ఉపయోగిస్తున్నారు. ఆ బ్లాక్ బస్టర్ సినిమా వచ్చి 17 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి పవన్ కి ఆ బ్యాగ్ సేంట్ మెంట్ అయిందట. పవన్ ఎక్కడకు వెళ్లిన వెంట ఆ బ్యాగ్ ఉండవలసిందే.

తనకు అవసరమైన కొన్ని అత్యవసర వస్తువులను ఆ బ్యాగ్ లో పెట్టుకొని ఒక సామాన్యుడిగా వైజాగ్ లో అడుగు పెట్టి అంబేత్కర్ భవన్ లో బస చేస్తున్నరు. స్టార్ హోటల్ ఉండకుండా నిరాడంబరంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. పవన్ తీసుకువెళ్ళుతున్న ఆ బ్యాగ్ పాతదే అయినా ఆ బ్యాగ్ ని మార్చటానికి పవన్ ఇష్టపడటం లేదట.