Politics

జనసేనలో యువసేన అధ్యక్షుడిగా రామ్ చరణ్ …పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తన కుటుంబం నుండి మద్దతు పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ కి చిరంజీవి కుటుంబానికి విభేదాలు ఉన్నాయని మొన్నటి వరకు అందరు అనుకునేవారు. అందుకే జనసేన గురించి చిరంజీవి కుటుంబం ఏమి మాట్లాడటం లేదని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సంచలనమైన ప్రకటన చేసాడు. బాబాయ్ తరుపున ప్రచారం చేయటానికి సిద్ధం అని ప్రకటించటం చాలా ఆసక్తికరంగా మారింది. బాబాయ్ పవన్ కళ్యాణ్ అనుమతి ఇస్తే జనసేన తరుపున ప్రచారం చేయటానికి సిద్ధమని చెప్పాడు. ఎవరు ఊహించని ఈ స్టేట్ మెంట్ తో ఒక వైపు మెగా అభిమానులు మరో వైపు జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువ సేనకు ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం కాంగ్రెస్ నేతల గుండెల్లో రైలు పరుగెత్తేలా చేసింది. అందుకే ప్రజారాజ్యంలో యువ రాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ నెంబర్ 2 స్థానాన్ని పొందాడు.

ఇప్పుడు జనసేనలో ఆ నెంబర్ 2 స్థానంలో అప్పటి పవన్ పాత్రను చరణ్ పోషించబోతున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పార్టీ కోసం ప్రజల కోసం బాబాయ్ ఎంతగానో కష్టపడుతున్నారని రామ్ చరణ్ అన్నారు.

గతంలోనే తాను ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేస్తానని అంటే బాబాయ్ వద్దని అన్నారని, కానీ ఇప్పుడు జనసేన తరుపున ప్రచారం చేయటానికి తాను సిద్ధమని రామ్ చరణ్ ప్రకటించాడు.