Movies

బిత్తిరి సత్తి నెలకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఎవరు ఎప్పుడు హీరోలవుతారో తెలియదు.. ఒకప్పుడు పొట్టచేత పట్టుకొని హైదరాబాద్ వచ్చిన చేవెళ్ల రవి.. ఒక్క అవకాశం అంటూ సినిమాలు, చానల్స్ తిరిగినా ఫలితం దక్కలేదు. చివరకు ఆ దేవుడి కరుణించి తీన్మార్ లో బిత్తిరి సత్తిగా అవతారం ఎత్తి హాస్యపు జల్లు కురిపిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.బిత్తిరి సత్తి వ్యక్తిగత జీవితానికి వస్తే అతని అసలు పేరు చేవెళ్ల రవి. రంగారెడ్డి జిల్లాలోని పమేనా గ్రామానికి చెందిన రవి చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. భిన్నమైన ప్రజలని చూసి అందరినీ ఇమిటేట్ చేయడం రవికి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు.అయితే స్నేహితుల సలహా మేరకు హైదరాబాద్ లో ఉద్యోగం కోసం వచ్చాడు. అతనికి ఉద్యోగం కూడా అంత త్వరగా ఏమీ రాలేదు.

ఎన్నో కష్టాలు పడ్డాక మొదట జీ తెలుగులో కామెడీ క్లబ్ షో అనే కార్యక్రమంలో మొదటిసారిగా అవకాశం వచ్చింది. అయితే ఆ షో సక్సెస్ కావడంతో రవికి అవకాశం వచ్చింది. ఆ తరువాత వీ6 చానెల్ లో తీన్మార్ వార్తలు చదవడానికి అవకాశం రావడంతో బిత్తిరిసత్తి దశనే మారిపోయింది.

బుల్లితెరపై తీన్ మార్ న్యూస్ ద్వారా వీ6 చానల్ లో పాపులర్ అయిన సత్తి అనంతరం తెలుగు రాష్ట్రాల్లో అందరినోటా నానాడు. ఇప్పుడు సత్తి పేరు తెలియని వారు ఏపీ, తెలంగాణల్లో ఉండరంటే అతిశయోక్తి కాదు.. నవ్వుల జల్లు కురిపించే తీన్మార్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారంటే సత్తి స్టామినాను అర్థం చేసుకోవచ్చు.. ఇటు తీన్మార్ లో నటిస్తూనే అటు సినిమాల్లోనూ కనిపిస్తూ సత్తి అలరిస్తున్నారు.

ప్రస్తుతం తీన్మార్ లో వచ్చే 5 నిమిషాల ఎపిసోడ్ కోసం సత్తికి ఆ చానల్ యాజమాన్యం ప్రతినెలా 1.50లక్షల రూపాయల వేతనం అందిస్తోందట.. కానీ బయట ఏదైనా ఓపెనింగ్స్ కు, ఇతర ఆడియో ఫంక్షన్లలో పాల్గొనడానికి సత్తికి సదురు నిర్వాహకులు రోజుకు 2 లక్షల పారితోషికం ఇస్తున్నారట.. ఇక సినిమాల్లో నటిస్తే 20 లక్షల దాకా ఇస్తున్నారట.

ఇలా తీన్మార్ లో కంటే బయటే ఎక్కువ సంపాదన వస్తుండడంతో సమయాభావం వల్ల సత్తి తీన్మార్ ను వదిలేసి ఆ చానల్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే తెలంగాణ సమాజానికి ఇక 9.30కు సత్తి కనపడనట్టే.. సత్తి సినిమాల్లో నటిస్తూనే బయట ప్రోగ్రాంలు చేసుకుంటేనే తీన్మార్ లో తమను అలరించాలని ప్రేక్షకులు కోరుతున్నారు. కానీ దీన్ని ప్రేక్షకులు ఆలకిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.