Movies

ఆఫీసర్ సినిమాలో నాగార్జున కూతురిగా నటించిన ఈ పాప ఎవరి కూతురో తెలుసా?

ఈ రోజు విడుదల అయినా నాగార్జున హీరోగా నటించిన ఆఫీసర్ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకువెళ్ళుతుంది. ఆ జోష్ తో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఈ సినిమాకి సంబందించిన విషయాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సినిమాలో నటించిన హీరోయిన్ ఎవరు/ నాగార్జున కూతురిగా నటించిన ఆ పాప ఎవరు? వీటి గురించే సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. రామ్ గోపాల వర్మ కర్ణాటక పోలీస్ అధికారి ప్రసన్న జీవిత కథ ఆధారంగా ఆఫీసర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కథ అనుకున్న వెంటనే వర్మ నాగార్జున దగ్గరకు వెళ్లి చెప్పాడట. మొదట నాగార్జున ఒప్పుకోలేదట. ఆ తర్వాత వర్మ నిదానంగా చెప్పి ఒప్పించాడట.

కథ ప్రకారం నాగార్జున కూతురిగా 10 సంవత్సరాల పాప కావాలి. పాప కోసం ముంబై వెళ్లి వర్మ కొన్ని యాక్టింగ్ స్కూల్స్ ని సంప్రదించాడట. అక్కడ ఆడిషన్స్ పెట్టి ముగ్గురిని సెలక్ట్ చేసాడు. వర్మకి అసంతృప్తి కలగటంతో ఆ ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేయలేదు వర్మ.

ఇక నాల్గో అమ్మాయిగా కావ్య వచ్చింది. కావ్యను చూడగానే ఆమె మేనరిజం నచ్చి వెంటనే ఒకే చేసేసాడట. బేబీ కావ్య ముంబై. ఆమె తండ్రి సాధారణమైన ఉద్యోగం. తల్లి గృహిణి. కావ్యకు చిన్నప్పటి నుండి నటన అంటే చాలా ఇష్టమట.

యాక్టింగ్ స్కూల్ లో నటన నేర్చుకుంటూ స్టేజ్ షో లు చేస్తుంది. మరాఠీ అమ్మాయి అయినా కావ్య తెలుగుని బాగా అర్ధం చేసుకొని సింగిల్ టెక్ లో సన్నివేశాలను చేసేసిందట. ఇప్పుడు సినిమాలో కావ్య నటనకు ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ సినిమాతో కావ్యకు తెలుగులో కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.