తారకరత్న భార్య ఎవరి కూతురు…జగన్ కి ఏమి అవుతుందో తెలుసా?
నందమూరి హీరో తారకరత్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఈయన బిగ్ బాస్ సీజన్2లో పాల్గొనబోతున్నాడని వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. దీంతో తారకరత్న గురించి అందరూ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారట.. ఈయన ఎవరు.? ఏం చేస్తున్నాడిప్పుడు.. ఈయన భార్య పిల్లలు ఎవరనేది ఆసక్తిగా మారింది.తారకరత్న అప్పట్లో అలేఖ్యరెడ్డి అనే అమ్మాయిని రహస్యంగా పెళ్లిచేసుకున్నాడు. అయితే అ అమ్మాయి ఎవరా అని ఆరాతీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2012లో హైదరాబాద్ లోని సంఘీ టెంపుల్ తారకరత్న-అలేఖ్య రెడ్డి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి అలేఖ్య తల్లిదండ్రులు హాజరుకాలేదు.
ఆమె అమ్మమ్మ మాత్రమే వచ్చారు. కులాంతర వివాహం కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. తారకరత్న కుటుంబం నుంచి ఒక్క వ్యక్తి కూడా హాజరుకాలేదు. కేవలం తారకరత్న స్నేహితులు, సన్నిహితులు మాత్రమే వచ్చారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడంతో ఎవరూ రాలేదు.
రిటైర్డ్ ఆర్డీవో మధుసూదన్ రెడ్డి కుమార్తె అలేఖ్య. ప్రతిపక్ష నేత జగన్ ఆడిటర్ , ఎంపీ విజయసాయిరెడ్డికి స్వయనా కోడలు వరుస అవుతుంది.
ఇక మరో రూమర్ ఏంటంటే.. నందీశ్వరుడు సినిమాకి తారకరత్నకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన అలేఖ్యరెడ్డి తారకరత్న తో పరిచయం పెంచుకొని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి అయ్యాక తారకరత్న డేట్స్, పేమెంట్స్ అన్నీ ఆమే చూస్తుందట.