Movies

ఆసుపత్రిలో సావిత్రి చనిపోయే చివరి క్షణంలో జెమిని ఏమి చేసాడో తెలుసా?

మహానటి సావిత్రి జీవితంలో అన్ని సంచలనాలే.జెమిని గణేశన్ తో సావిత్రి వివాహం అయ్యాక సావిత్రి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. సావిత్రి మద్యానికి బానిస కావటం,జెమిని సావిత్రికి దూరం కావటం వంటివి ఆమె జీవితాన్ని మరింత కృంగదీసాయి. కొన్ని పరిణామాల కారణంగా సావిత్రి జీవితంలో జెమిని విలన్ గా మారిపోయారు. సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమిని అని ఇటీవల వచ్చిన సావిత్రి బయో పిక్ లో కూడా చూపించారు. ఈ విషయం గురించి అలనాటి నటి రమాప్రభ మాట్లాడుతూ కీలకమైన విషయాలను తెలిపారు. సినిమాలో చూపినట్టు సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమిని గణేశన్ కాదు. సావిత్రికి ఎంతో మొండితనం ఉండేది.

సావిత్రి ఆసుపత్రిలో చేరినప్పటి నుండి చనిపోయే వరకు ఆమెను ప్రేమించిన ఒకే ఒక వ్యక్తి జెమిని గణేశన్. ఆసుపత్రిలో సావిత్రి దగ్గర కూర్చొని జెమిని చాలా బాధపడేవారు. జెమిని గణేశన్ మొదటి భార్య సావిత్రిని బాగా చూసుకుంది.

అలాగే సావిత్రి కూడా ఆమెతో చాలా బాగా ఉండేది. జెమిని పిల్లలు అందరు కలిసి మెలసి ఉండేవారని, సావిత్రి సినిమాలు నిర్మించటం కారణంగానే ఎక్కువగా నష్టపోయింది.

జెమిని గణేశన్ సినిమాలు తీయవద్దని సావిత్రికి చెప్పిన ఆమె వినలేదని, నేను సావిత్రి కి దగ్గరగా ఉండటం వలన ఈ విషయాలు తెలిశాయని రమాప్రభ చెప్పారు.