Movies

ఉదయ్ కిరణ్ ని దత్తత తీసుకుంటే ఆలా జరిగేది కాదు…కన్నీళ్లు పెట్టిన సుధ

నటి సుధ ఇటీవల అలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఒక టీవీ కార్యక్రమంలో తన జీవితానికి సంబందించిన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఈ సందర్భంలో అలీ సుధను ఉదయ్ కిరణ్ కి మీకు ఉన్న అనుబంధం గురించి అడగగా… అప్పుడు సుధ ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ముందు ఎలా ఉండేవాడో చెప్పుకొచ్చారు. ఉదయ్ కిరణ్ హీరో కాక ముందు నుంచే నాకు తెలుసు. చాలా సినిమాల్లో వాడికి అమ్మగా నటించాను. చాలా మంచివాడు. ప్రతి ఒక్కరికి సాయం చేయాలని అనుకునేవాడు. అలాగే తనకు చేతనైన సహాయాన్ని చేస్తూ ఉండేవాడు. అప్పట్లో ఉదయ్ కిరణ్ ని దత్తత తీసుకోవాలని భావించాను. కానీ ఈ లోపే వాడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్యకు ముందు ఉదయ్ కిరణ్ చాలా డల్ గా ఎదో కోల్పోయిన వాడిలా కనిపించేవాడు. ఒకరోజు నేను ఉదయ్ కిరణ్ ని పిలిచి అడిగితే మీకు చాలా చెప్పాలమ్మ అని అన్నాడు. కానీ ఇప్పుడు కాదు. నేనే వీలు చూసుకొని మన ఇంటికి వస్తా అని చెప్పాడు.

ఆలా చెప్పిన కొన్ని రోజలకే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ చనిపోతే సొంత కొడుకు చనిపోయినట్టు అనిపించింది. ఒకవేళ నేను దత్తత తీసుకోని ఉంటే ఇలా జరిగేది కాదేమో అని కన్నీటి పర్యంతం అయ్యారు సుధ.