Movies

బిగ్ బాస్ 2లో లాస్య ఫిక్స్.. అయితే లాస్య భర్త ఏమన్నాడో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మా టీవీలో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 1 ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కార్యక్రమం అదిరిపోయే TRP రేటింగ్స్ తో దూసుకుపోతూ ఆ షో కి వచ్చిన కంటేస్టెంట్స్ కి మంచి గుర్తింపును తెచ్చిపెట్టటమే కాకుండా మంచి ఆఫర్స్ వచ్చేలా చేసింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కావటానికి అన్ని రకాల ఏర్పాట్లను చేసుకుంది. అయితే ఈ సీజన్ కి హోస్ట్ గా ఎన్టీఆర్ కి బదులు నేచురల్ స్టార్ నాని వ్యవహరిస్తున్నాడు. ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా స్టార్ మా యాజామాన్యానికి నో చెప్పటంతో నానిని ఎంపిక చేసారు. చాలా మంది హీరోల పేర్లు వినిపించిన చివరకు నాని ఫైనల్ అయ్యాడు. నానికి కూడా అవార్డు ఫంక్షన్ లను హోస్ట్ చేసిన అనుభవం ఉంది.

అంతేకాకుండా సీజన్ 1 మంచి మైలేజ్ ని తీసుకురావడంతో సీజన్ 2 మరింత రక్తి కట్టించాలని అని మా యాజమాన్యం ప్లాన్ వేసింది. దాంతో ఈసారి వచ్చే కంటేస్టెంట్స్ మరింత పేరు గాంచిన వాళ్ళు అయితే షో మరింత పాపులర్ అవుతుందని ప్లాన్ వేశారు.

దాంతో ఈసారి షో ని ఏకంగా 100 రోజులు, 16 మంది కంటేస్టెంట్స్ తో సూపర్ అనిపించేలా చేయాలనీ ప్లాన్ చేస్తుంది బిగ్ బాస్ యాజమాన్యం. ఆ దిశగానే ప్రయత్నాలను కూడా చేస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా సీజన్ 2 కి వచ్చే కంటేస్టెంట్స్ ఎవరు అని పేర్లు మాత్రం బయటకి రాలేదు. ఇక తాజాగా బిగ్ బాస్ రెండో సీజన్ కి లాస్య ఎంపీక అయినట్లు తెలుస్తోంది.

లాస్య కూడా ప్రస్తుతం సినిమా అవకాశాలు కానీ, యాంకర్ గా కానీ బిజీగా లేదు.. అందుకే ఆమె బిగ్ బాస్ 2లో పాల్గొనెందుకు సిద్దం అవుతుందట ఇందుకు ఆమె భర్త కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది అదికారికంగా మాత్రం ఇంకా కన్ఫామ్ కాలేదు. మరో రెండు రోజుల్లో ఇందులో పాల్గొనే సెలబ్రెటీల పేర్లు బిగ్ బాస్ యూనిట్ బయట పెట్టనున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ఇటువంటి ఊహాగానాలు తప్పవు.