Movies

సమంతకి షాక్ ఇచ్చిన ఉపాసన…మెగా అక్కినేని కోడళ్ల యుద్ధం

ప్రస్తుతం ట్విట్టర్ లో ఫిట్నెస్ ఛాలెంజ్ జోరుగా సాగుతుంది. సినీ స్టార్స్,స్పోర్ట్స్ స్టార్స్ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటూ దీనికి మరింతగా ప్రచారం కల్పించారు. టాలీవుడ్ లో స్టార్స్ మాత్రమే కాదు వారి భార్యలు కూడా సై అంటే సై అంటూ ఈ ఫిటినెస్ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య భార్య సమంతా ఫిటినెస్ ఛాలెంజ్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యకు విసరటం, దీన్ని సీరియస్ గా తీసుకున్న ఉపాసన వెకేషన్ లో ఉన్నప్పటికీ ఈ ఛాలెంజ్ ని పూర్తి చేయటం గమనార్హం. హే సమంతా నేను వెకేషన్ లో ఉన్నప్పటికీ ని ఫిట్నెస్ ఛాలెంజ్ ని స్వీకరించాను అంటూ ట్విట్టర్ లో ఉపాసన తెలిపింది.

అంతేకాకుండా ఉపాసన ఈ ఫిటినెస్ ఛాలెంజ్ ని మహేష్ భార్య నమ్రతకు విసిరారు. ఉపాసన లండన్ లోని ప్రఖ్యాత జిమ్ లో ఫిటినెస్ ఛాలెంజ్ ని పూర్తి చేసారు. రామ్ చరణ్ కూడా ఉపాసనతో పాటు లండన్ లోనే ఉన్నాడు.