Movies

మంచు మనోజ్ షాకింగ్ కౌంటర్… రూమర్స్ కి చెక్

మంచు ఫ్యామిలిలో మోహన్ బాబు తర్వాత అయన వారసులు ఆ స్థాయిలో హిట్ అందుకోవడంలో విఫలం అవుతున్నారు. మంచి యాక్టర్స్ అయినప్పటికీ కథలను ఎంచుకోవడంలో తప్పులు చేయటం వలన పరాజయాలు చవి చూస్తున్నారు. ముఖ్యంగా మంచు మనోజ్ కెరీర్ లో సరైన హిట్ అందుకోలేదు. మంచి మాస్ ఫిజిక్ ఉన్నప్పటికీ పరాజయాలు తప్పటం లేదు. సరైన కథ దొరికితే ఈ హీరో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసాడు. మనోజ్ రీసెంట్ గా నటించిన ఒక్కడున్నాడు సినిమా పరాజయం పొందింది. దాంతో కాస్త విరామం తీసుకున్నాడు. ఇప్పటివరకు ఎలాంటి కథలను ఫైనల్ చేయలేదు.

దాంతో మనోజ్ కొన్ని వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన భార్య ప్రణతితో విభేదాలు వచ్చి దూరంగా ఉంటున్న మనోజ్ త్వరలోనే విడాకులు తీసుకుంటున్నాడనే రూమర్స్ వచ్చాయి.

ఆ రూమర్ కి మంచు హీరో మంచి కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం మనోజ్ తన భార్యతో కలిసి కొంతకాలంగా అమెరికాలో ఉంటున్నాడు. మనోజ్ తన భార్య,సన్నిహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇలా సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసి వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేసాడు మంచువారబ్బాయి మనోజ్.

మంచు మనోజ్ డిఫెరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అంతేకాక మంచు విష్ణు నిర్మాణంలో కూడా ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు మనోజ్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."