Movies

జబర్ధస్త్ ‘శాంతి స్వరూప్’ ఎవరు.. ఏ ఊరు.. ఆయన తండ్రి ఎవరో తెలుసా.?

జబర్ధస్త్.. ప్రతి గురు, శుక్రవారాల్లో నవ్వులు పూయించే ఇదంటే అందరికీ అభిమానమే.. ఈ నవ్వుల కార్యక్రమం ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి వరుసగా కమెడియన్స్ ను అందిస్తోంది. షకలక శంకర్, చంద్ర, వేణు, హైపర్ ఆది లాంటి వారు ఎంతో మంది కమెడియన్స్ వరుసగా సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు.ఏదైనా ఒక షో సంవత్సరం పాటు సాగితేనే అది పెద్ద హిట్ కింద లెక్క.. కానీ ఈటీవీలో వచ్చే జబర్ధస్త్ మాత్రం ఏళ్ల తరబడి అందరికీ కామెడీ పంచుతోంది. ఇక సుమ స్టార్ మహిళ అయితే ప్రారంభమై 10 ఏళ్లు అవుతోంది. ఇక జబర్ధస్త్ 2013లో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతోంది. తెలుగులో నంబర్1 షోగా ప్రజాదరణ పొందింది.

జబర్ధస్త్ లో టీం లీడర్లు ఇప్పటికే పాపులర్ కాగా.. ముఖ్యంగా లేడీ గెటప్ లు వేసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జబర్ధస్త్ లో జడ్జీలు, యాంకర్స్ ఆడవారు ఉన్నారు కానీ.. స్కిట్స్ చేసేటప్పుడు ఆడ గెటప్ లు మగవారే వేసుకొని చేస్తున్నారు. అందులో ముఖ్యంగా శాంతి స్వరూప్ గురించి ముందుగా చెప్పుకోవాలి.

శాంతి స్వరూప్ స్వగ్రామం నెల్లూరు జిల్లా బోగోలు మండలం.. కొత్తూరు గ్రామం. తండ్రి రాఘవయ్య.. వ్యవసాయ కుటుంబం.. చదువు పూర్తికాగానే 1998 నుంచి 2001 వరకు ఎస్టీడీ బూత్ లో నెలకు వెయ్యి రూపాయల జీతానికి పనిచేశాడు. చిత్ర పరిశ్రమలోకి రావాలనే కోరికతో హైదరాబాద్ వచ్చాడు. మొదట జబర్ధస్త్ లో ఆఫీస్ బాయ్ గా చేరాడు. రచ్చరవి, రాకెట్ రాఘవతో పరిచయం పెంచుకొని చివరకు చమ్మక్ చంద్ర ద్వారా జబర్ధస్త్ కామెడీ షోలో ప్రవేశించాడు. మొదటగా శాంతి అని పేరున్న ఇతడికి శాంతి స్వరూప్ గా నామకరణం చేసింది యాంకర్ సుమ అట..

ఇక అలా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న సమయంలోనే హైపర్ ఆది టీమ్ లీడర్ కావడం.. ఆ టీమ్ లో లేడీ గెటప్ లు వేయడానికి అవకాశం ఇవ్వడంతో శాంతి స్వరూప్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

ఇక శాంతి స్వరూప్ కు సినిమాల్లోనూ అవకాశాలు వచచాయి. నితిన్ నటించిన ‘లై’. మనో జ్ నటించిన ‘ఒక్కడు మిగిలాడు’, ఎన్టీఆర్ నటించిన జైలవకుశ, నెల్లూరు పెద్దారెడ్డి వంటి సినిమాల్లో చిన్న పాత్రలు దక్కించుకున్నాడు. హాస్య నటుడిని కావాలన్న తన కోరికను నెరవేర్చుకున్నాడు