Movies

‘కాలా’ హీరోయిన్ ఈశ్వరి రావు ఎవరి భార్య….చూస్తే ఆశ్చర్యపోతారు

ఈ రోజు రజనీకాంత్ సినిమా ‘కాలా’ విడుదల అయింది. ఈ సినిమాలో ఎంతో మంది మంచి నటులు ఉన్నారు. ముంబై మురికివాడ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో డాన్ గా రజనీకాంత్,రాజకీయ నాయకుడు,విలన్ గా నానాపటేకర్ నటించారు. చాలా కాలం తరవాత తెలుగు అమ్మాయి ఈశ్వరి రావు రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఆమె చూపిన నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. రజనితో సమానంగా నటించిన ఈశ్వరి రావు తెలుగు అమ్మాయి అని చాలా మందికి తెలియదు. ఈశ్వరి రావు అసలు పేరు వైజయంతి. ఆమె స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం. సినిమాల మీద ఆసక్తితో చెన్నై వెళ్లగా 1990 లో ఒక తమిళ సినిమాలో అవకాశం వచ్చింది.

Actress Eswari Rao Pics @ A AA Audio Release

అయితే ఆ సినిమా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా విడుదల కాలేదు. దాంతో అడపా దడపా చిన్న చిన్న పాత్రలను చేస్తున్న ఈశ్వరి రావు 1997 లో చేసిన తమిళ సినిమా రామన్ అబ్దుల్లా సినిమా ద్వారా హీరోయిన్ గా స్థిరపడింది.

ఈశ్వరి రావు బాగా సెలక్ట్ చేసుకొని హీరోయిన్ గా మాత్రమే యాక్ట్ చేస్తూ ఉంది. 1998 లో మనోజ్ కుమార్ హీరోగా వచ్చిన గురు పారవర్ సినిమాలో నటించి మంచి పేరు సంపాదించింది. ఖుషూబు,ప్రకాష్ రాజ్ తదితరులతో భారతీరాజా తీసిన సినిమా నెపోలియన్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గటంతో టీవీ సీరియల్స్ మీద దృష్టి సారించింది. తెలుగు,తమిళంలో చాలా సీరియల్స్ లో కీలకమైన పాత్రలను పోషించింది. ఇప్పుడు చాలా కాలం తరువాత రజనీకాంత్ సినిమా కాలా లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.

కాలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రజనీకాంత్ హీరోయిన్ తెలుగు అమ్మాయి అని చెప్పటంతో ఆ అమ్మాయి ఎవరా అని అరా తీయటం మొదలు పెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ పెద్దాపురం అమ్మాయని తెలిసి అందరు ఆశ్చర్యపోతున్నారు.

ఇక‘నిన్నే పెళ్లాడుతా’ సీరియల్‌లో నటించేటప్పుడు ఈశ్వరీరావు ఎల్‌.రాజాతో పరిచయం అయ్యింది. ఆ సీరియల్‌కు ఆయనే దర్శకులు. ఆయన ప్రవర్తన, మంచితనం ఈశ్వరీరావుని ఆకట్టుకున్నాయి. బాధ్యతగల మనిషి అనుకుంది. ఆయన మంచితనం చూసి ఇంట్లో వాళ్లు కూడా ఓకే చేయడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈశ్వరీరావుకు ఇద్దరు పిల్లలు. నివేదిత (9), రిషబ్‌రాజా (5). ఈశ్వరీరావు ఎల్‌ రాజాకు కూడా భార్య అంటే ప్రాణం.