Movies

తన భార్యతో విడాకులకు అసలు కారణం చెప్పిన క్రిష్

టాలీవుడ్ లో జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ కి వెరైటీ కథలను తెరకెక్కిస్తాడనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి హీరో క్రిష్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలనీ కోరుకుంటారు. క్రిష్ దర్శకత్వంలో చేసే అవకాశం వస్తే పారితోషికం విషయంలో కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు కొంత మంది హీరోలు. అంతటి క్రేజ్ ఉన్న దర్శకుడు క్రిష్ గురించి గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో క్రిష్ తన భార్య రమ్యకు విడాకులు ఇస్తున్నాడని ఒక వార్త హల్ చల్ చేస్తుంది.క్రిష్,రమ్యల వివాహం ఆగస్టు 7 2016 లో అంగరంగ వైభవంగా జరిగింది. బాలకృష్ణ హీరోగా వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మధ్యలో మూడు వారాలు విరామం తీసుకోని క్రిష్ రమ్యను వివాహం చేసుకున్నాడు.

వీరి పెళ్లి పెద్దలు కుదిర్చారు. ఆ పెళ్ళిలో మంచు లక్ష్మి చేసిన హంగామా,హడావిడి అంతా ఇంతా కాదు. క్రిష్ పెళ్లి అంటే ఇప్పటికి మంచు లక్ష్మి చేసిన హడావిడి గుర్తుకువస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వీరిద్దరూ విడాకులు తీసుకోవటానికి సిద్ధం అయ్యారనే వార్తలు వస్తున్నాయి.

అయితే వీరి మధ్య పెద్దగా గొడవలు ఏమి లేవట. అయితే అవగాహనా లోపంతోనే ఇద్దరు సమ్మతంగానే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి క్రిష్ చెప్పితేనే అసలు నిజాలు బయటకు వస్తాయి. అంతవరకూ ఇటువంటి ఊహాగానాలు తప్పవు.

ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్ సినిమా మణికర్ణిక సినిమాకి దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయో పిక్ కి దర్శకత్వం వహించనున్నారు. ఏది ఏమైనా సినీ పరిశ్రమ అంటేనే గాసిప్ ల మయం. విడాకుల విషయంలో క్రిష్ మరియు అయన సన్నిహితులు కూడా ఏమి మాట్లాడటం లేదు. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."