Movies

బ్రేకింగ్ న్యూస్ – మంచు మనోజ్ తన విడాకులపై సంచలన నిర్ణయం

మంచు వారబ్బాయి మనోజ్ గురించి ఈ మధ్య రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మంచు మనోజ్ కి భార్య ప్రణతికి పడటం లేదని విడాకులు తీసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొట్టింది. ఈ విషయంపై మంచు మనోజ్ స్పష్టత ఇచ్చాడు. ప్రస్తుతం మనోజ్ ప్రణతితో కలిసి అమెరికాలో ఉన్నాడు. తాజాగా మనోజ్ ట్విట్టర్ లో అయన అభిమానులతో చాట్ చేసి, అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పాడు. ఒక అభిమాని మీరు మీ భార్య ప్రణతికి విడాకులు ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మీ భార్య ప్రణతిపై మీ అభిప్రాయం ఏమిటని అడగగా… మనోజ్ ఆమె నా దేవత అని చెప్పి వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టాడు.

మరొక అభిమాని కులం పేరుతో కొంతమంది రాజకీయనేతలు మన దేశాన్ని విభజించాలని చూస్తున్నారని….దీనిపై మీ అభిప్రాయం ఏమిటని అడిగితే, మనోజ్ బ్రిటిషర్స్ మనకు డివైడ్ అండ్ రూల్ పాలసీని నేర్పించి వెళ్లారని చెప్పారు.

మొన్న మనోజ్ తన భార్య ప్రణతి,సన్నిహితులతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ విధంగా తనపై వస్తున్న రూమర్స్ కి తొందరగానే చెక్ పెట్టేసాడు మంచువారబ్బాయి మనోజ్.