Movies

బిగ్ బాస్ హౌస్ లో నాని ఉన్నప్పుడు భార్య ఏమి చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు

నేచురల్ స్టార్ నాని తన ప్రస్థానాన్ని రేడియో జాకీగా ప్రారంభించి సినీ పరిచయాలు పెంచుకొని హీరో కావాలని కలలు కన్నాడు. అయితే డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు క్లాప్ కొట్టిన నాని స్వయంకృషితో తిరుగులేని హీరోగా మారాడు. చిన్న బడ్జెట్ నిర్మాతలకు గ్యారెంటీ హీరోగా మారాడు నాని. నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా అవతారం ఎత్తి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం నాని బిగ్ బాస్ సీజన్ 2కి హోస్ట్ గా చేయనున్నాడు. బుల్లితెర మీద కూడా తానేమిటో నిరూపించుకోవాలని ఉబలాటపడుతున్నారు. నానిని పక్కా ఫ్యామిలీ మెన్ అని అంటారు. ఎందుకంటే సినిమా షూటింగ్ అయ్యిపోగానే ఇంటికి చేరిపోతాడు. ఇక నాని 2012 లో అంజనాను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

నాని సినిమాలు,బిగ్ బాస్ తో బిజీ అయ్యిపోవటంతో నాని భార్య అంజనా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అంజనా బెంగుళూర్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన సంగతి తెలిసిందే. అంజనా రాజమౌళి క్రేయేటివ్ టీమ్ లో రమా రాజమౌళితో కలిసి పనిచేస్తున్న విషయం చాలా మందికి తెలియదు.

ప్రస్తుతం రామ్ చరణ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమాకు కూడా పనిచేయాలని డిసైడ్ అయ్యిందట. రాజమౌళి సినిమా అంటేనే సంవత్సరాల తరబడి షూటింగ్స్ జరుగుతాయి. అందుకే బాహుబలి సమయంలో అంజనా నానికి దూరంగా ఉండి పనిచేయాల్సి రావటంతో RRR పనిచేయకూడదని నాని,అంజనా అనుకున్నారు.

అయితే నాని బిజీగా మారటంతో అంజనా కూడా ఇక చేసేది ఏమి లేక RRR సినిమాకి కమిట్ అయ్యిపోయింది. ఇక అంజనా రెండు సంవత్సరాలు ఫుల్ పనితో బిజీ అయ్యిపోయినట్టే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."