Movies

కొడుకును భయపెడుతున్న లక్ష్మి ప్రణతి…. అది చూసిన ఎన్టీఆర్ షాక్

ఎన్టీఆర్ తన కుమారుడు అభయ్ రామ్ ముచ్చట్లని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా తన సతీమణి లక్ష్మి ప్రణతి, అభయ్ రామ్ అందమైన ఫోటోని ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ పిక్ వైరల్ గా మారింది. లక్ష్మి ప్రణతి తన కొడుకు పట్ల ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో ఎన్టీఆర్ తెలియజేశాడు. ఆమె నుంచి నేను కూడా అభయ్ ని కాపాడలేనని సరదాగా కామెంట్ చేశాడు.ప్రతిరోజు పాలు తాగడానికి చాలా మంది చిన్నపిల్లలు మారం చేస్తుంటారు. కానీ లక్ష్మి ప్రణతి అంత సులువుగా విడిచిపెట్టేలా లేదు. అభయ్ ని కూర్చో బెట్టి మరి పాలు తాగిస్తోంది.

చేసేది లేక బిక్కు బిక్కుమంటూ తాగలేక పాలు తాగుతున్న అభయ్ రామ్ చూపులు అమాయకంగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్యామిలీ పట్ల తన భార్య ఎంత కేర్ తీసుకుంటుందో ఎన్టీఆర్ చెప్పకనే చెప్పాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."