Health

“యోగ” అంటే ఒక పరిపూర్ణత్వం..

సంస్కృత పదం “యుజ్ ” ఉచ్ఛారణలో “యోగ” గా పరిణామక్రమం చెందింది. సంస్కృతం లో “యుజ్” అంటే ఏకం కావడం అలాగే జోడింపబడడం అని అర్ధం. శారీరక శక్తీ మరియు మానసిక శక్తి లను ఏకం చేసి, శారీరక, మానసిక దుర్బలత్వం లను పారదోలి, శరీరానికి, మనసుకు దృఢత్వాన్ని ప్రసాదించేదే.. ఈ యోగ అనే ప్రక్రియ.ఉపనిషత్తులు, భగవద్గిత లో కూడా యోగ ప్రస్తావన ఉంది. క్రీస్తుపూర్వమే, పతంజలి అనే ఓ మహానుభావుడు, హిందూ ఆధ్యాత్మిక ప్రపంచం లో భాగమైన యోగాను, “పతంజలి యోగ సూత్రాలు” గా క్రోడీకరించాడు.

ఇతర వ్యాయామాలు ద్వారా శారీరక పటుత్వం మాత్రమే సాధ్యపడుతుంది. కానీ యోగాతో శారీరక పటుత్వం తో బాటు, యోగాలో భాగమైన ధ్యానం, ప్రాణాయామం అనే ప్రక్రియలవలన మానసిక ఏకాగ్రత, మానసిక ప్రశాంతత చేకూరతాయి. తద్వారా, మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, మానసిక వ్యాధులు వంటివి దరిచేరవు. ఈ విధంగా సుఖమయ మానవ జీవితానికి కారణమౌతుంది ఈ యోగ.