Health

యోగాతో శిల్పా శెట్టి ఎంత గ్లామర్ గా మారిందో చూస్తే ఆశ్చర్యపోతారు

బాలీవుడ్ లో సెక్సీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పొడుగు కాళ్ళ సుందరి శిల్ప శెట్టి తన అందానికి, ఫిట్ నెస్ కి సీక్రెట్ యోగా అని చెప్పుతుంది. ఆమె యోగా చేయటమే కాకుండా అందరిలోనూ ఎవెర్ నెస్ తీసుకురావటానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. అందంగా,ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఉత్తమమైన మార్గం అని చెప్పుతుంది శిల్పా శెట్టి. ఆమె తల్లి అయినా 40 సంవత్సరాల వయసులో కూడా ఇంత గ్లామర్,అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి కారణం యోగా. ఆమె ఏ ఆసనం వేస్తె ఏ ఆరోగ్య ప్రయోజనం కలుగుతుందో వివరంగా చెప్పే ఒక వీడియోను విడుదల చేసింది.

అయితే యోగా చేసేటప్పుడు ప్రారంభంలో గురువు పర్యవేక్షణ ఉండాలని చెప్పుతుంది. ప్రారంభంలో గురువు దగ్గర నేర్చుకున్నాక ఇంటిలో మనమే చేయవచ్చు. శిల్పా శెట్టి సినిమాలకు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకున్నాక యోగ CD లు చేసి యోగాను ప్రచారం చేసే పనిలో పడింది.

యోగా ఇండియాలో పుట్టిన విదేశాలలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. దాంతో చాలా పట్టుదలగా మన ఇండియాలో కూడా మంచి ప్రాచుర్యం పొందేలా చేయటానికి కృషి చేస్తుంది ఈ పొడుగు కాళ్ళ సుందరి. ఆమె యోగా క్లాస్ లను రెగ్యులర్ గా నిర్వహిస్తుంది. అంతేకాక యోగా మీద ఒక పుస్తకాన్ని కూడా రాసింది. అందంగా, నాజూగ్గా, ఫిట్ గా కనపడాలంటే యోగాసనాలు వేయాల్సిందే అని చెప్పుతుంది శిల్పా శెట్టి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."