Movies

RRR లో రామ్ చరణ్ కి ఛాన్స్ రావటానికి కారణం ఆ హీరోనా?

బాహుబలి తర్వాత రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ సినిమా పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే రకరకాల ఊహాగానాలు వచ్చాయి. సినిమా ప్రకటించిన నాటి నుంచి రోజుకో స్టోరీ బయటకు వస్తోంది. వాటిలో ఏది వాస్తవం కాదని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విషయంలో రాంచరణ్ కు హీరోగా అవకాశం దక్కడం వెనుక పెద్ద కథనే నడిచిందని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది.తారక్ అంటే రాజమౌళికి ఎంతో ఇష్టం. ఆ మధ్య బాహుబలి ప్రచారం కోసం చెన్నై వెళ్లినప్పుడు రాజమౌళి తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అని బహిరంగంగా ప్రకటించాడు. రాజమౌళి-ఎన్టీలు కలిసి ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమాతోనే తమ సినీ ప్రయాణాన్ని ప్రారంభించడంతో వారిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ.
Ram charan And NTR
బాహుబలి తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్లాన్ చేశాడట.. కానీ తన దగ్గరకు వచ్చిన ఓ మల్టీస్టారర్ కథను ఎన్టీఆర్ తో చర్చించాడట.. అయితే ఎన్టీఆర్ ఆ స్క్రిప్ట్ మీద మనసు పడటంతో మరో హీరో కోసం వెతికారట. ఇక ఎన్టీఆర్ సలహా మేరకే రాజమౌళి రాంచరణ్ ను ఈ ప్రాజెక్ట్ కు ఎంపిక చేశారని అంటున్నారు.
Rajamouli,NTR,Ram charan
రాజమౌళి , ఎన్టీఆర్ ఇద్దరూ ప్రాణ స్నేహితులే.. బయటకు స్టోరీ తెలియదని చెబుతున్నా ఎన్టీఆర్ , రాంచరణ్ లకు ట్రిపుల్ ఆర్ స్టోరీ లైన్ చెప్పాడట రాజమౌళి. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, రష్మిక మందనా హీరోయిన్లుగా ఎంపిక చేశారట..

ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ గా రాంచరణ్ పోలీస్ గా కనిపించనున్నాడని సమాచారం. బాహుబలి రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. మరి ఈ క్రేజీ మల్టీస్టారర్ బాహుబలి రికార్డులను బీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.