నువ్వు ముందు నీ ఏజ్ తెలుసుకో… అనసూయకు ఆది దిమ్మతిరిగే పంచ్
ఒక ప్రముఖ ఛానల్ లో వస్తున్న జబర్దస్త్ కార్యక్రమం ఏ స్థాయిలో నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ వచ్చే గురువారం,శుక్రవారం రోజు తొమ్మిదిన్నరకు పనులు మానుకొని మరీ జబర్దస్త్ చూసే వారు చాలా మందే ఉన్నారు. ఈ మధ్య జబర్డస్త్ షో గాడి తప్పుతుందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో బయట నుంచి వచ్చే విమర్శలు కన్నా పార్టిసిపెంట్స్ మధ్య కోల్డ్ వార్ ఎక్కువగా జరుగుతుంది. TRP రేటింగ్స్ కోసం చేస్తున్న పనులు తప్పిదాలుగా మారి ఒకరినొకరు వ్యక్తిగత దూషణలు చేసుకొనే రేంజ్ కి వెళ్లాయి. మొన్న వారం అనసూయ,ఆది కాంట్రవర్సీ తెలిసిందే. ఆది అనసూయతో హగ్ ఇప్పించుకొని టాక్ అఫ్ టౌన్ గా నిలిచాడు.
అంతటితో ఆగకుండా ఆది మరల అనసూయను కౌగలించుకొని షాక్ ఇచ్చాడు. ఈ విషయంపై అనసూయ ఫైర్ అయినా సంగతి తెలిసిందే.
ఆదికి ఫోన్ చేసి… ఆది హద్దుల్లో ఉండు, అవకాశం ఇచ్చానని అడ్వాంటేజ్ తీసుకోవద్దని అన్న అనసూయకు ఆది అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. నేను చాలా సినిమాల్లో చాలా మంది అమ్మాయిలతో నటిస్తున్నాను. అలాగే నా లిమిట్స్ నాకు తెలుసు.
ఎదో స్కిట్ డిమాండ్ చేసింది కాబట్టి చేసానని, అనసూయ కూడా తన ఏజ్ తెలుసుకొని మాట్లాడాలని గట్టిపంచ్ ఇచ్చేసాడు ఆది. వీరి మధ్య జరుగుతున్నా వార్ ఎంత దూరం వెళుతుందో, ఆది మాటలకు అనసూయ ఏమైనా కౌంటర్ ఇస్తుందా… లేదా ఆది పంచ్ లకు బలి అవ్వటం ఎందుకు అని సైలెంట్ గా ఉంటుందా అనేది వేచి చూడాలి.