Health

ఈ ఆసనం వేస్తే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు

నడుము, పొత్తికడుపు కండరాలను బలపరచి ఆసనాల్లో పాదవృత్తాసనం ఒకటి. కాస్త సౌకర్యంగా ఉన్న ఎక్కడైనా సాధన చేయగలిగిన ఆసనమిది. కొత్తగా సాధన చేసేవారు గురువుల పర్యవేక్షణలో మాత్రమే దీన్ని సాధన చేయాలి.

ఈ ఆసనం ఎలా వేయాలి
చదునుగా, సౌకర్యంగా ఉన్న చోట చాప వేసుకొని వెల్లికలా పడుకోవాలి. రెండుకాళ్ళూ ఎడంగా పెట్టాలి. ఇప్పుడు కుడికాలును పైకిలేపి దాన్ని గడియారపు ముళ్ళు తిరిగే దిశలో తిప్పాలి. ఈ సమయంలో రెండోకాలు, నడుము కదలకుండా చూసుకోవాలి. ఇలా 5 సార్లు చేసిన తర్వాత కాలిని అపసవ్య దిశలో తిప్పాలి. పై విధంగానే ఈసారి ఎడమకాలితో సవ్య, అపసవ్య దిశలో 5 సార్లు చొప్పున తిప్పాలి. చివరగా రెండుకాళ్లను కలిపి నిలబెట్టి సవ్య, అపసవ్య దిశల్లో 5 సార్లు చొప్పున తిప్పి తిరిగి విరామ స్థితికి రావాలి.

ఉపయోగాలు
అన్ని అవయవాలూ కదిలి శక్తివంతం అవుతాయి.
బలహీనంగా ఉన్న కీళ్లు గట్టిపడతాయి.
పొత్తికడుపు కింది కొవ్వు కరిగి పొట్ట తగ్గిపోతుంది