ప్రభాస్ పెళ్లి ప్రముఖ విద్యా సంస్థల అధినేత కూతురితో ఫిక్స్

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్ అయినా ప్రభాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ప్రభాస్ పేరు టాలీవుడ్ స్వీటీ అనుష్కతో కలిపి విన్పించేది. వెండితెరపై ప్రభాస్,అనుష్క జోడి ఎంత పెద్ద హిట్… ఈ విషయాన్నీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిల్లా,మిర్చి,బాహుబలి సినిమాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో మనకు తెలిసిన విషయమే. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని వీర లెవల్లో పండించే వీరిద్దరూ బయట కూడా మంచి ఫ్రెండ్స్ కావటంతో వీరి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఇద్దరూ కూడా మా మధ్య ఏమి లేదని కేవలం మంచి ఫ్రెండ్స్ అని సమయం వచ్చినప్పుడలా చెపుతూనే ఉంటారు.

ఇప్పుడు ప్రభాస్ గురించి ఒక బలమైన వార్త వినపడుతుంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్ ఎరేంజ్ మేరేజ్ కి ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ప్రభాస్ కోసం ఒక అమ్మాయిని సెలక్ట్ చేసాడట.

భీమవరం ప్రాంతంలో అనేక విద్యాసంస్థలకు అధిపతి అయినా ఒక ప్రముఖుని కుమార్తెను ప్రభాస్ కోసం చూశారట. ప్రభాస్ తల్లి శివకుమారికి కూడా ఆ అమ్మాయి బాగా నచ్చిందని, రెండు కుటుంబాల మధ్య లాంఛనాలకు సంబందించిన విషయాలు జరుగుతున్నాయట.

పెదనాన్న కృష్ణంరాజు మాటను ఎప్పుడు వినే ప్రభాస్ ఇప్పుడు అమ్మాయి విషయంలో కూడా పెదనాన్న మాటకు విలువ ఇచ్చాడట. త్వరలోనే ఈ విషయం ఒక కొలిక్కి వస్తుందని కోనసీమలో జోరుగా హల్చల్ చేస్తుంది.