Movies

సుదీర్ తో పెళ్లి సంచలన నిజాలు బయట పెట్టిన రేష్మి

బుల్లితెరపై రేష్మి సందడి అంతా ఇంతా కాదు. జబర్జస్త్ షో ద్వారా చాలా పాపులారిటీని సంపాదించింది. సుదీర్,రేష్మి పెళ్లి గాసిప్స్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవల ఒక షోలో సుదీర్,రేష్మి లు సరదాగా పెళ్లి చేసుకున్నట్టు నటించటంతో ఈ గాసిప్స్ కి మరింత బలం చేకూరింది. దీనితో సుదీర్,రేష్మి గురించి అనేక ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే విషయంపై తాజాగా ఒక నెటిజన్ చేసిన కామెంట్,దానికి రేష్మి స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. రేష్మి,సుదీర్ మీరిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టినట్టు ఉంటారు. మీరిద్దరూ కెరీర్ కోసం చాలా కష్టపడుతున్నారు. అని నెటిజన్ ట్వీట్ చేసాడు.

ఇది చూసిన రేష్మి కాస్త ఘాటుగానే స్పందించింది. మేము ఒకరి కోసం మరొకరు పుట్టామని మీరు ఎలా డిసైడ్ చేస్తారు. మేము తెరపై నటించటం మాత్రమే మీరు చూస్తారు. రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి చాల తేడా ఉంటుంది.

తెరపై చూసేది ప్రేక్షకులకు వినోదాన్ని పంచటానికి మాత్రమే. ఎవరిని పెళ్లి చేసుకోవాలో అనేది మా వ్యక్తిగత అభిప్రాయం. మీ సూచనలు మాకు అవసరం లేదని చెప్పింది. రేష్మి ఇచ్చిన ఈ ఘాటు రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.