Movies

చిరు బరువు పెరగటానికి కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

చాలా విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రామ్ చరణ్ నిర్మాతగా సురేంద్రరెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా వేగంగా హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మధ్య జరిగిన కార్యక్రమాలలో చిరుని చూస్తే బరువు బాగా పెరిగినట్టు కనిపించారు. దాంతో అందరికి చిరు ఇంత సడన్ గా బరువు ఎందుకు పెరుగుతున్నారో అర్ధం కాలేదు. సైరా సినిమా కోసం చిరు బరువు పెరగారట. సైరా సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చిరు వయస్సు మళ్ళిన పాత్రలో నటిస్తున్నాడట. అందుకే బరువు పెరగాడట చిరంజీవి.

ఇక స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణెదల ప్రొడక్షన్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."