Movies

అరవింద సమేత వీర రాఘవలో మెగా హీరో….ఆనందంలో మెగా ఫాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమా యాక్షన్,కుటుంబ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ సినిమాకి సంబందించి ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు కీలకమైన రోల్ మరియు ఫుల్ లెంట్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. త్రివిక్రమ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటుంది.

నాగబాబు ఫ్యాక్షన్ నాయకుడిగా కన్పిస్తారట. అందుకే రాయలసీమ యాసలో డైలాగ్స్ త్రివిక్రమ్ రాస్తున్నారట నాగబాబు కోసం. ఈ సినిమాలో నాగబాబు చివరి వరకు కన్పిస్తారట.

ఈ సినిమాకి సింగీతం థమన్ అందిస్తున్నారు. ఈ సినిమా విశేషాలను అభిమానులకు థమన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెడ్గే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."