Movies

‘అలీతో సరదాగా’ షోకి వచ్చి అలీతో గొడవ పడ్డ హైపర్ ఆది

ఒక ప్రముఖ ఛానల్ లో వస్తున్న అలీతో సరదాగా కార్యక్రమానికి అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రతి వారం ఒక ఆర్టిస్ట్ ని తీసుకువచ్చి వారిని ఎవరు అడగని పర్సనల్ ప్రశ్నలను కూడా అడుగుతూ, వారిలోని ఎమోషన్స్ బయటకు తీయటంలో చాలా యుక్తిని చూపిస్తున్నాడు. అలీ ఇప్పటి వరకు యాంకర్,హోస్ట్ గా చేసిన కార్యక్రమాలకు బిన్నంగా అలీతో సరదాగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చే ఆర్టిస్ట్ ల మనోగతాన్ని అభిమానులకు తెలిపే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. వెండితెర నటులనే కాకుండా బుల్లితెర జబర్దస్త్ నటులను కొంత మందిని సెలక్ట్ చేసుకొని వారిని అలీతో సరదాగా కార్యక్రమానికి పిలిచి వారి మనస్సులోని మాటలను చెప్పేస్తున్నాడు.

ఈ కార్యక్రమానికి అలీ హైపర్ ఆదిని తీసుకువచ్చాడు. హైపర్ ఆదికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ మనకు తెలిసిన విషయమే. ఆది కోసమే జబర్దస్త్ చూసే వారు ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు. హైపర్ ఆది తన స్కిట్స్ లో సోషల్ కంటెంట్ తో పాటు కరెంట్ ఎఫైర్స్ ని కూడా చేస్తూ ఉంటాడు.

అటువంటి హైపర్ ఆదిని అలీతో సరదాగా కార్యక్రమానికి పిలిచాడు అలీ. అలీ ఆది స్కిట్స్ గురించి మాట్లాడటం ప్రారంభించగానే ఆది నన్ను టార్గెట్ చేసారని లేచి వెళ్ళిపోతూ ఉండగా అలీ ఆపి మీ మనస్సులో ఉన్న విషయాన్నీ చెప్పాలంటే చెప్పవచ్చు….లేదంటే మానేయవచ్చు. ఇందులో ఎటువంటి బలవంతం లేదని చెప్పాడు అలీ. ఈ ప్రోమో చూస్తే ఆది,అలీల అలీతో సరదాగా ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని అనిపిస్తుంది.