Movies

నాన్న పవన్.. పిన్ని లెజినోవా మధ్యలో అకీరా.. ఏం చేశాడో చూస్తే ఆశ్చర్యపోతారు

ఇటీవల రేణుదేశాయ్ తన కొడుకు అకీరాను జూనియర్ పవర్ స్టార్ అని కొంతమంది సోషల్ మీడియాలో అంటే ఫైర్ అయ్యింది. అకీరాను అలా పిలవద్దంటూ సీరియస్ అయ్యింది. తన కొడుకు సొంతంగా ఎదిగేందుకు తాను భరోసానిస్తున్నానని.. అకీరాను అకీరాలాగే గుర్తించాలని అభిమానులన కోరింది. రేణుదేశాయ్ వ్యాఖ్యలు చూశాక ఆమె పవన్ కళ్యాణ్ గాలి కూడా తన కుమారుడి మీద పడకుండా పెంచాలనే ఆలోచనతో ఉన్నట్టు అర్థమైంది. తండ్రి వారసత్వాన్ని పిల్లలకు అంటగట్టకుండా దూరంగా పెంచుతున్న రేణు తాజాగా పవన్ కళ్యాణ్ ఆపరేషన్ కు మాత్రం ఫుణె నుంచి కొడుకు అకీరాను పంపి అందరినీ ఆశ్చర్యపరిచింది. తండ్రి బాగోగులు చూడడానికి అకీరా రావడం తాజాగా హాట్ టాపిక్ గా మారింది.

పవన్ కళ్యాణ్ ఇటీవల ఉత్తరాంద్ర జిల్లాల్లో పర్యటించారు. విశాఖలోని అరకులో పర్యటించిన తర్వాత తన రాజకీయ యాత్రను అర్ధాంతరంగా నిలిపివేశాడు. సడన్ గా హైదరాబాద్ వచ్చేశారు. మళ్లీ యాత్ర జోలికి పోవడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ కంటి బాధ ఎక్కువ కావడంతోనే యాత్ర నుంచి వైదొలిగినట్టు తెలిసింది.

తాజాగా ఈరోజు విజయవాడలోని కంటి ఆస్పత్రిలో పవన్ కంటి ఆపరేషన్ కు రెడీ అయ్యాడు. విజయవాడలోని హోటల్ గదిలోంచి కొడుకు అకీరా, భార్య అన్నాలెజినోవా తో కలిసి రావడం మీడియా కంట పడింది. పవన్ కు కంటి ఇన్ఫెక్షన్ సోకిందని.. ఈరోజు ఆపరేషన్ కోసమే విజయవాడకు వచ్చినట్టు తెలిసింది.

పవన్ వెంట సహాయకుడిగా కొడుకు అకీరా ఉండడం.. పవన్ మూడో భార్య అన్నా లెజినోవా కూడా ఉండడంతో పిన్నితో అకీరా ఎలా ఉంటాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే అకీరా అవేమీ పట్టించుకోకుండా తన తండ్రిని పట్టుకొని ఆస్పత్రికి తరలించాడు. పిన్నితో గొడవలకు పోకుండా అదే సమయంలో ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్ గా తండ్రికి సేవలు చేశాడట.. ఇలా విజయవాడలో పవన్-అకీరాల అనుబంధం మీడియా కంట పడేసరికి అందరూ దీనిపైనే చర్చించుకుంటున్నారు.