Movies

నా కొడుకు నాకే… రేణు దేశాయ్ కి పవన్ సీరియస్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. రేణు దేశాయ్ పవన్ తో విడిపోయాక రేణు పిల్లలను తీసుకోని పూణే వెళ్ళిపోయింది. ఇప్పటివరకు పిల్లలే లోకంగా బ్రతికింది. అయితే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పింది. దాంతో పవన్ అభిమానులు రేణు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకోవటానికి వీలు లేదని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. దీనిపై రేణు చాలా ఘాటుగా స్పందించింది. అయితే గత కొన్ని రోజులుగా రేణు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్ లను చూస్తుంటే ఆమె మరో పెళ్ళికి సిద్ధం అయినట్టు తెలుస్తుంది.

ఇటీవల ఒక వ్యక్తి చేయి పట్టుకొని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నీతో ఉంటే సంతోషంగా,శాంతంగా ఉంటుంది. నా చేయి ఎప్పటికి వదలకు. అంటూ పోస్ట్ పెట్టిన దగ్గర నుండి పవన్ కళ్యాణ్ బయటకు రాకపోవటం గమనించాలి. పవన్ కంటికి ఆపరేషన్ అయిందని అంటున్న, ఈ రెండో పెళ్లి కారణంగా పవన్,రేణు మధ్యలో తీవ్ర విభేదాలు వచ్చాయి.

పవన్ కి రేణు రెండో పెళ్లి చేసుకోవటానికి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ, కొడుకు అకిరాను తన దగ్గరకు పంపమని డిమాండ్ చేసాడట. దానికి రేణు ఒప్పుకోకపోవడంతో పవన్ కి తీవ్రంగా కోపం వచ్చిందట. నీవు సింగిల్ గా ఉంటే అమ్మ దగ్గర కొడుకు ఉంటాడు. నీవు మరో వ్యక్తికీ భార్యవు. నీకు అంటూ వేరే జీవితం ఏర్పడుతుంది.

అకిరా పెద్దవాడు అయ్యాడు…వాడికి నా అవసరం ఉంది. నువ్వు పంపకపోతే నేనే తీసుకువెళ్తా అని వార్నింగ్ ఇచ్చాడట పవన్. ఈ గొడవలు కొన్ని రోజులుగా జరుగుతున్నాయట. ఈ లోపు పవన్ కంటి ఆపరేషన్ అని అకీరా పూణే నుండి పవన్ దగ్గరకు వచ్చేసాడు. ఇక పవన్ అకీరాను రేణు దగ్గరకు పంపడని అయన సన్నిహితులు చెప్పుతున్నారు.