Movies

బిగ్ బాస్ 2 లో కిరీటిని తరిమి తరిమి కొట్టి చుక్కలు చూపించిన కౌశల్

బిగ్ బాస్ 2 కి వచ్చినప్పటి నుండి ఎవరిని నొప్పించకకుండా తిరుగుతూ పుల్లలు పెడుతున్న కిరీటి దమరాజ్ కి శుక్రవారం చుక్కలు చూపించాడు కౌశల్. కిరీటి కౌశల్ తో నీ కారణంగా ఆడవాళ్లు ఇబ్బంది పడుతున్నారని అనడంతో…కిరీటి సారీ చెప్పేవరకు కౌశల్ తరిమి తరిమి కొట్టబోయాడు. ఆడవాళ్ల అందరిని వరుసలో నిల్చోబెట్టి తాను తప్పు చేయలేదని వారితో చెప్పించాడు. ఇలా కిరీటి నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టి కౌశల్ బుద్ది చెప్పాడు. బిగ్ బాస్ చివరలో కౌశల్ విపరీతమైన బీభత్సాన్ని సృష్టించాడు. కౌశల్ కిరీటి మీదకు వెళుతుంటే నూతన్ నాయుడు ఆపాడు. అప్పుడు కిరీటి కౌశల్ కి సారీ చెప్పాడు.

కౌశల్ అమ్మాయిల మీద చేతులు వేయమని,కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వనని ప్రతిన పునాడు. ఇంటి సభ్యులు తన మీద పక్షపాతం చూపిస్తున్నారని, దీనితో చాలా కలత చెందానని ఎలిమినేటి అయితే బయటకు వెళ్లిపోతానని అన్నాడు కౌశల్. పోయే ముందు నన్ను ఏడిపించినవారిని రచ్చ రచ్చ చేసి వెళతానని ఆవేశంగా కౌశల్ అన్నాడు. ఇలా కిరీటి,కౌశల్ మధ్య 20 నిమిషాల పాటు తీవ్రమైన వాగ్వివాదం జరిగింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."