Movies

దీప్తి సునైనా చేసిన పని…ఏది తప్పో మీరే చూడండి

బిగ్ బాస్ సీజన్ 2 ప్రతి ఎపిసోడ్ చూడటానికి చాలా ఇంటరెస్టింగ్ తో ఎంతో రసవత్తరంగా సాగుతుంది. పార్టిసిపెంట్స్ కూడా హోరాహోరీగా పోరాటం చేస్తున్నారు. తొలివారం పెద్దగా ఆకట్టుకొని నాని రెండో వారం విశ్వరూపం చూపించాడని చెప్పాలి. ప్రేక్షకులు మొదటి వారంలో పెద్దగా కనెక్ట్ కాలేదు. రెండో వారం వచ్చేసరికి పరిస్థితి మారి ప్రేక్షకులు నిదానంగా బిగ్ బాస్ పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. ఓటింగ్ శాతం కూడా మొదటి వారంతో పోలిస్తే రెండో వారం బాగా మెరుగయ్యింది. సంజన,నూతన్ నాయుడు ఎలిమినేటి అయిన ఆ ప్రభావము అసలు కన్పించలేదు. రెండో వారంలో హోస్ట్ నాని ఎంత సీరియస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా యూట్యూబ్ సెన్సేషన్ దీప్తి సునైనాకు అదిరిపోయే క్లాస్ ఇచ్చాడు. చాలా కూల్ గా ఉండే నాని ఎంతో రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడటంతో హౌస్ లో అందరు కామ్ అయ్యిపోయారు.

ఇక దీప్తి సంగతికి వస్తే ఆమెను హౌస్ లో మొదటి నుంచి చిన్నపిల్ల వలెనే ట్రీట్ చేసారు. హౌస్ లోకి రాగానే టాస్క్ లో భాగంగా కౌశల్ దీప్తిని రెండు చేతులతో ఎత్తుకొని తీసుకువెళ్లటంపై చాలా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఒక చిన్న పిల్లను తీసుకువెళ్లే విధానం ఆదా అంటూ కౌశల్ పై విమర్శలు వచ్చాయి.

దాంతో కౌశల్ పట్ల హౌస్ లోను,ప్రేక్షకుల్లోనూ తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది. అంతేకాక దీప్తికి తోడు భాను శ్రీ కూడా కన్సెషన్ రూమ్ లో మాట్లాడుతూ కౌశల్ తనపై చేతులు వేసి మాట్లాడుతున్నాడని బిగ్ బాస్ కి కంప్లైంట్ ఇచ్చింది.

వాస్తవానికి చిన్నపిల్లగా భావించిన దీప్తి లాంచింగ్ ఎపిసోడ్ లోనే నానికి హగ్ ఇచ్చి అందరికి ఆశ్చర్యం కలిగించింది.అయితే హౌస్ లోకి వెళ్ళగానే టాస్క్ లో భాగంగా కౌశల్ ఎత్తుకోగానే రచ్చ రచ్చ చేసింది. దీప్తి నిజంగా హార్ట్ అయిందని భావించి ఆమె బాధను నిజమే అనుకున్నారు.

కానీ హోస్ట్ నాని దీప్తికి సంబందించిన ఒక ప్రయివేట్ వీడియోను రివీల్ చేసాక అసలు విషయం అందరికి అర్ధం అయింది . నాని ఒక పిట్ట కథ చెప్పి దీప్తి గుట్టు రట్టు చేసాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన నందినితో దీప్తి మాట్లాడుతూ కౌశల్ మరో రెండు రోజుల్లో వెళ్ళిపోతాడని చెప్పింది.

అంతేకాకుండా కౌశల్ కి వ్యతిరేకంగా కిరీటి,తనీష్ లకు నూరిపోసింది. దాంతో వారిద్దరూ కౌశల్ మీద పర్సనల్ గా టార్గెట్ చేయటం బిగ్ బాస్ హౌస్ లో స్పష్టంగా కనిపించింది. రెండో వారంలో ఇలాంటి ఘటనలు కౌశల్ పై సానుభూతిని పెంచాయి.

దీప్తి సునైనా తెర వెనక ఎలాంటి కుట్రలు చేస్తుందో అందరికి అర్ధం అయింది. ఆమె చిన్నపిల్ల కాదని హౌస్ లో అందరిని స్టడీ చేసాక గేమ్ ప్లే చేస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.