Movies

రేణు దేశాయ్ కి షాకిచ్చిన అకిరా నందన్ ప్రవర్తన

ఏ తల్లిదండ్రులకైనా పుత్రుని ప్రవర్తనతోనే పేరుప్రఖ్యాతులు వస్తాయి. అందుకే పెద్దలు పుత్రోత్సహాం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. పుత్రుడు పుట్టినపుడు కాకుండా , అతని గొప్పతనాన్ని పదిమందీ గుర్తించి మెచ్చుకున్నప్పుడేనని అంటారు కదా. మరి మరి ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో గొప్ప లవర్స్ గా, వెలుగొందిన రేణుదేశాయ్,పవన్ కళ్యాణ్ వైవాహిక బంధం కొన్నాళ్లకే బెడిసికొట్టింది. వీళ్ళు విడిపోయినా, వీరికి పుట్టిన అకిరా నందన్, ఆద్య ల రక్త సంబంధం మాత్రేమే ఇంకా కలిపి ఉంచుతోందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ పుత్రోత్సహం ఎలా ఉంటుందో ఇప్పుడే పవన్, రేణులకు తెల్సి వస్తోంది. దీనికి కారణం రేణు త్వరలోనే మరోపెళ్లికి రెడీ అవుతుండడమే. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో గుప్పుమంటోంది. ఎందుకంటే తనకు కాబోయే రెండో పెళ్లి గురించి రేణు ఇప్పటికే ఎన్నో పోస్టులు పెట్టింది కూడా.

అంతటితో ఆగకుండా తనకు కాబోయే జీవిత భాగస్వామితో నిశ్చితార్ధం కూడా అయిందని, ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో రేణు పోస్ట్ చేసింది. నిజానికి ఇండస్ట్రీలో పవన్, రేణుల జంట ఓ సంచలనం. ఇద్దరి మధ్య బంధం నడిచి,మళ్ళీ విడిపోయినప్పుడు కూడా ఇండస్ట్రీ ఆసక్తిగా గమనించింది.

మామూలుగానే ఇద్దరు భార్యాభర్తలు విడిపోతే,వాళ్ళ జ్ఞాపకాలను అంత తొందరగా మరిచిపోవడం సాధ్యం కాదు. అందునా సెలబ్రిటీలైన రేణు,పవన్ ల విషయంలో ఇలాంటి ఎమోషన్స్ ఎక్కువగానే నడిచాయి. ముఖ్యంగా పవన్ మరోపెళ్ళి చేసుకున్నప్పుడు రేణు తనలోని భావాలను కవితల రూపంలో వెళ్లగక్కింది.

ఇక గతం గతః అని భావించి రేణు కూడా రెండో పెళ్ళికి సిద్ధమవుతూన్న వేళ ఆనంద డోలికల్లో తెలియాడుతున్నట్లు కనిపిస్తోంది. పెళ్లి వార్తలపై ఎలాంటి అడ్డుచెప్పని పవన్ కూడా లోలోన మదన పడుతున్నట్లు తెలుస్తోంది. ఎంతలేదన్నా నిన్నటి దాకా తన జ్ఞాపకాల్లో ఉన్న రేణు ఇప్పుడు మరో వ్యక్తి సొంతం కావడం జీర్ణించుకోవడం కష్టమే మరి. మాజీ భర్తగానే మిగిలిపోయే పవన్,సంతోషంగానే రేణు తీసుకున్న నిర్ణయంపై సానుకూలంగానే స్పందించాడు.

ఆమెను అభినందిస్తూ రేణుకు గిఫ్ట్ కూడా పంపాడు. ఆమె పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటేనే నాకు కూడా ఆనందమని పవన్ చెప్పడం విశేషం. ఒకవిధంగా పవన్, రేణుల మధ్య ఇలాంటి మార్పు రావడానికి ప్రధాన కారణం వీరికి పుట్టిన అకిరా నందన్ అని చెప్పక తప్పదు. ఇంకా వయస్సు ఉన్న తల్లి పెళ్లి చేసుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేయడంతో పాటు, రేణుకి కొత్తగా వచ్చే భర్తను నాన్నగా గౌరవిస్తానని చెప్పి తల్లి జీవితంలో అకిరా సంతోషం నింపాడు మరోవైపు ‘నీకు కూడా ఓ కుటుంబం వుంది కదా.

నేను, చెల్లి పెద్దయ్యాం. మాకూ ఓ కుటుంబం వుంటుంది’అని పవన్ కి అకిరా నచ్చజెప్పి, తల్లి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా మార్గం సుగమం చేసాడు. అకిరా వయస్సులో చిన్నోడే అయినా తల్లిని తండ్రిని మానసికంగా ఓ మంచి మార్పు వైపు నడిపించాడు. బంధు మిత్రుల నుంచి సెహ బాష్ రా అని అకిరా అభినందనలు అందుకుంటున్నాడు. ఇక అభిమానులకూ పండగే.